చిరంజీవి 150వ చిత్రానికి 'కత్తి' నిర్మాత!!

Chiranjeevi 150th film producers

01:33 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Chiranjeevi 150th film producers

పద్మభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న 150వ చిత్రం ఏంటో అందరికీ తెలిసిపోయింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 150వ చిత్రం గురించి చిరు తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ ఓ క్లారిటీ ఇచ్చాడు. తమిళ స్టార్‌ హీరోతో ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించిన 'కత్తి' చిత్రాన్ని చిరంజీవి తో రీమేక్‌ చేస్తున్నామని ప్రకటించాడు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని మా సొంత బ్యానర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తానని చెప్పాడు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడానికి ఒక అగ్ర నిర్మాత సంస్థ ముందుకొచ్చింది.

తమిళంలో కత్తి చిత్రాన్ని నిర్మించిన 'లైకా ప్రొడక్షన్స్‌' సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్‌ తో పాటు సంయుక్తంగా నిర్మించనుంది. జనవరి లో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుంది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రంతో పాటు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'రోబో 2.0' ని కూడా 400 కోట్లు బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

English summary

Chiranjeevi 150th film producers was tamil Kathi movie producers Lyca productions. Lyca productions is also producing Robo 2.0 with 400 crores budget.