తన 150వ చిత్రం టైటిల్ ను ప్రకటించిన చిరు..

Chiranjeevi 150th film title

12:05 PM ON 4th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150th film title

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే చిరు అభిమానులకు శుభవార్త. చిరు 150వ చిత్రం టైటిల్ ను ప్రకటించేశారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురష్కరించుకుని చిరు-రామ్ చరణ్ అభిమానులు ఏపి, తెలంగాణా, తమిళ నాడు, కర్ణాటక, కేరళ, మస్కట్, దుబాయి, యూఎస్ఏ మరియు ప్రపంచ నలు మూలలా రక్త ధానం శిభిరాలను ఏర్పాటు చేశారు. దీనికి కృతఘ్నతలు చెప్పడానికి తాజ్ కృష్ణ లో ఏర్పాటు చేసిన చిరంజీవి అక్కడకి వచ్చారు. ఇలా రక్త ధానాల శిభిరాలు ఏర్పాటు చేసినందుకు అభిమానులకి కృతఘ్నతలు చెప్పు తన 150వ చిత్రం గురించి కూడా ప్రకటించాడు.

ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను ఖరారు చెయ్యగా ఈ చిత్రాన్ని వి.వి. వినాయక్ దర్శకత్వంలో, చరణ్ నేతృత్వంలో వచ్చే నెలలో ప్రారంభం కానుందని చిరు తెలిపారు. దీనితో అక్కడున్న చిరు అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి.

English summary

Chiranjeevi 150th film title. Kathilantodu title for Chiranjeevi 150th movie. V. V. Vinayak is directing this movie.