చిరు 150వ సినిమాకి అడ్డు తగులుతున్నది ఎవరు?

Chiranjeevi 150th Movie Getting Late Because Of His Family

12:51 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150th Movie Getting Late Because Of His Family

దాదాపు రెండేళ్ళు నుండి ఊరిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రానికి సంబందించి రామ్‌చరణ్‌ తేజ్‌ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'కత్తి' చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నామని, దానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తారని, మా సొంత బ్యానర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మస్తామని రామ్‌చరణ్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాక తెలుగు నేటివిటికి అణుగుణంగా స్క్రిప్ట్‌మార్చే పనిలో వి.వి.వినాయక్‌ నిమగ్నమవ్వగా, నిర్మాంతర కార్యక్రమాలు రామ్‌చరణ్‌ చూసుకుంటున్నాడు. మార్చిలో ఈ చిత్రం సెట్స్‌ పైకి వెళ్తుందని కూడా చెప్పారు. అయితే మళ్ళీ ఈ చిత్రం ప్రారంభానికి మరో అడ్డంకి ఎదురైంది. ఈ సారి చిరు ఇంట్లోవాళ్ళే అడ్డు అయ్యారు. అదేంటంటే చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్ళి నిశ్చయించిన సంగతి తెలిసిందే. మార్చి 28న జరగబోయే ఈ పెళ్ళి పనుల్లో అందరూ బిజీగా ఉండడంతో మార్చిలో కూడా సినిమా సెట్స్‌ పైకి వెళ్ళడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. దీనితో ఈ సారి చిరు 150వ సినిమాకి ఇంట్లో వాళ్ళే అడ్డు అయ్యారని తెలుస్తుంది.

English summary

We all know that Tollywood Mega Star Chiranjeevi has committed to Remake Tamil Kathi Movie as his 150th film.But it was getting late because of his family members.