ఇంతకీ కత్తిలాంటోడు పక్కన కాజల్ ! 

Chiranjeevi 150th movie heroine kajal agarwal

10:44 AM ON 22nd July, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150th movie heroine kajal agarwal

అవునా, అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే, పవన్ సినిమా ఫంక్షన్ లో ముద్దుగుమ్మ కాజల్ ని చందమామతో మెగాస్టార్ పోల్చినప్పుడే కత్తిలాంటోడు పక్కన హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు తెలిసిపోయింది. అయితే నార్మల్‌గా సినిమాల్లో ట్విస్టులు ఇస్తున్నట్టే .. ;కొంచెం మోతాదు హెచ్చి, చిరు 150వ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త షికారు చేస్తోంది. సైలెంట్‌గా షూటింగ్ జరిగిపోతున్న ఈ ఫిల్మ్ గురించి లేటెస్ట్ న్యూస్. చిరంజీవి పక్కన నయనతార, అనుష్క, శ్రియ నటించే ఛాన్స్ వుందంటూ ఇప్పటివరకు క్యాంపెయిన్ సాగింది. కానీ ఎవరనేది ఓకే కాలేదు.

తాజాగా కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రెండున్నర కోట్లు కాజల్ డిమాండ్ చేయడంతో ఆమె పక్కనపెట్టినట్టు తొలుత టాక్. ప్రజెంట్ థర్డ్ షెడ్యూల్ మొదలుకావడంతో హీరో- హీరోయిన్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. అందువల్లే ఈమెని ఒప్పించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మొత్తం మీద హీరోయిన్ ఎవరన్నది కొద్దిరోజుల్లోనే బహిర్గతం కాగలదని అంటున్నారు.

ఇది కూడా చూడండి: ఒక ద్రాక్ష పండు ఖరీదు తెలిస్తే.. గుండె గుభేల్!

ఇది కూడా చూడండి: ఇంట్లోనే KFC ఫ్రైడ్ చికెన్ చేస్కోండిలా..

ఇది కూడా చూడండి: చద్దన్నం గురించి తెలిస్తే షాకవుతారు ?

English summary

Chiranjeevi 150th movie heroine kajal agarwal.