చిరు '150' ప్రీ-పోస్టర్ వచ్చేసింది(ఫోటో)

Chiranjeevi 150th movie pre poster were released

05:56 PM ON 19th August, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150th movie pre poster were released

రాజకీయ అరంగేట్రం కోసం సినీ రంగాన్ని వదిలేసిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ, అది కూడా 150వ మూవీకోసం చాలానే కసరత్తు చేసాడు. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఇది చిరంజీవి 150వ సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా వున్నాయి. అందుకే చిరంజీవి అండ్ కో సకల జాగ్రత్తలూ తీసుకుని తమిళ కత్తిని రీమేక్ చేస్తున్నారు. సినిమా కోసం స్లిమ్ కూడా అయ్యాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్ట్ 22న విడుదల చేయనున్నారు.

ఆ విషయం తెలియజేయడానికి గురువారం రాత్రి ఓ ప్రీ-లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే అందులో కూడా ఈ సినిమా పేరేంటన్నది వెల్లడించలేదు. కేవలం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే బ్యానర్ ను, హైదరాబాద్ సింబల్స్ అయిన ఛార్మినార్, బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట చూపించారు. ఇంకా పేరుపెట్టని ఈ మూవీకి పేరు ఎప్పుడు పెడతారో చూడాలి.

English summary

Chiranjeevi 150th movie pre poster were released