ప్రారంభమైన చిరు 150వ సినిమా 

Chiranjeevi 150th Movie Started

04:09 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi 150th Movie Started

మెగా అభిమానులకు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తీపి కబురు అందింది. అదేనండీ చిరంజీవి 150వ సినిమా సంగతి ... ఎట్టకేలకు ఈ సినిమా మొదలైంది . ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చిరంజీవి 150వ సినిమా అనుకున్న ముహూర్తానికి ప్రారంభమైంది . తమిళంలో బ్లాక్ బస్టర్ 'కత్తి' సినిమా రీమేక్ చేస్తున్నారు. కత్తి స్టోరీ లైన్‌ని ఇటు చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా.. అటు తెలుగు ఆడియన్స్‌కు అనుగుణంగా తీర్చిదిద్దాడు దర్శకుడు వి.వి.వినాయ‌క్. ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిరు 150వ చిత్రం సందర్భంగా ఈ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ను చిరు భార్య సురేఖ శుక్రవారం లాంఛ్ చేశారు. ప్రముఖ రచయత పరుచూరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా...నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ మెగా కార్యక్రమానికి అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగబాబు, నిహారిక, అల్లు అరవింద్‌తో సహా మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. వీరితోపాటు దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు శరత్ మారర్, డివివి.దానయ్య, పరుచూరి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు.

ఇవి కూడా చదవండి:వామ్మో..  ఆ ఈతచెట్టు పగలు వాలిపోయి.. రాత్రి లేచి నిలబడుతోందట!

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవంలో కాపి కొట్టిన మహేష్ 

1/6 Pages

English summary

Maga Star Chiranjeevi's 150th movie was started in agrand manner with his Family members today in Hyderabad. Director V.V.Vinayak and Paruchuri Brothers were attended to this movie event