వాచీ ఇచ్చిన  మెగాస్టార్ కే టైం ఇవ్వలేదా?

Chiranjeevi About DSP in Sardar Audio Launch

09:45 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Chiranjeevi About DSP in Sardar Audio Launch

అవును, మొదట్లో అతని ప్రతిభను చూసి చేతికున్న వాచీని బహుమతిగా ఇచ్చి నీ టైం మారుతుందని ఆశీర్వదించిన మెగా స్టార్ చిరంజీవికే ప్రస్తుతం దొరక్కుండా టైం లేదని చెబుతున్నాడా? ఇంతకీ అలా చెప్పేదెవరు? ఎందుకు అలా చెబుతున్నాడు? ఈ ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. చిరంజీవే స్వయంగా ఈ విషయం చెబుతుంటే , సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మెలికలు తిరిగిపోతూ , దణ్ణం పెట్టేసాడు .

హైదరాబాద్ లో జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ 'దేవీశ్రీ ప్రసాద్ ని వెంటబెట్టుకుని ఆతని తండ్రి సత్యమూర్తి ఓ సారి నా దగ్గరకు వచ్చాడు. అప్పడు దేవీశ్రీ చేతిలో కీ బోర్డ్ కూడా వుంది. అతను చూపిన ప్రతిభ నన్ను ఆకర్షించి వెంటనే చేతిలో వున్న వాచీ తీసి ఇచ్చేసా. నీ టైం మారుతుందని చెప్పాను. ఆనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ అయ్యాడు. నా సినిమాలకి , పవన్ సినిమాలకీ , ఇంకా పలువురి హీరోల సినిమాలకు మంచి సంగీతం అందించాడు. ఇంకా అందిస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ కి అందించిన సంగీతం చాలా బాగుంది. అయితే నా 150వ సినిమా కు సంగీతం అందించమని అడుగుదామంటే దొరకడం లేదు. అంతలా ఖాళీ లేకుండా వున్నాడు' అన్నప్పుడు చిరంజీవి కి దేవీశ్రీ ప్రసాద్ దణ్ణం పెట్టేస్తూ మిలికలు తిరిగిపోయాడు. అంటే మెగాస్టార్ 150వ సినిమాకి దేవీశ్రీ కన్ఫర్మ్ అయినంట్టేగా .

English summary