బ్రేకింగ్ న్యూస్: చిరు-బన్నీల మల్టీస్టారర్!

Chiranjeevi and Allu Arjun in multi starrer

11:08 AM ON 21st September, 2016 By Mirchi Vilas

Chiranjeevi and Allu Arjun in multi starrer

ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రెస్ గా వుండే టాలీవుడ్ లో రానురాను తీరుమారింది. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా మల్టీస్టారర్ పిక్చర్లకు కొదవ ఉండేది కాదు. కారణాలు ఏమైతేనేం ఈ తరహా చిత్రాలు తగ్గినా, ఈ మధ్య మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇక టాప్ హీరోలు సైతం ఈ మల్టీస్టారర్లు చేసి, మంచి స్టోరీ ఉంటే ఎవరితోనైనా కలిసి నటించేందుకు సిద్ధం అని చెప్పకనే చెప్పారు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనున్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది. అందులో హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు హీరోలుగా నటించనున్నారని ప్రచారం జరుగుతుంది..

శాండిల్ వుడ్ లో రెబెల్ స్టార్ అంబరీష్.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లు కలిసి 'దొడ్లమాన హడ్గ' పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా, ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే, సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట. ఇప్పటికే బన్నీకి ఆఫర్ పంపగా, పరిశీలనలో ఉందని టాక్. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను, తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట. మరి ఇది కార్యరూపం దాలుస్తుందా లేదా? అనేది వేచిచూడాలి.

ఇది కూడా చదవండి: రాధికా ఆప్టేని ఒక నైట్ కి రమ్మన్న స్టార్ హీరో ఎవరు?

ఇది కూడా చదవండి: హల్ చల్ చేస్తున్న ఎయిర్టెల్ బ్యూటీ బాత్రూం వీడియో

ఇది కూడా చదవండి: 'ఇండియన్ స్పీల్ బర్గ్' సింగీతం గురించి ఆసక్తికర విషయాలు

English summary

Chiranjeevi and Allu Arjun in multi starrer. Megastar Chiranjeevi and Allu Arjun was acting in multistarrer movie. And it is remaking from kannada movie.