ఆ విషయంలో 'నాగ్' చెప్పినట్టే 'చిరు' చేస్తాడు

Chiranjeevi and Nagarjuna Business partners again

12:53 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Chiranjeevi and Nagarjuna Business partners again

మెగాస్టార్ సినీ వినీలాకాశంలో అగ్రశ్రేణికి ఎదగడంలో స్వయం కృషే కారణమని చెప్పినా, అందుకు అనువైన పునాది వేయడంలో మామ అల్లు రామలింగయ్య, బావమరిది అల్లు అరవింద్ పాత్ర కీలకం అని చెప్పక తప్పదు. అరవింద్ కి చెప్పకుండా చిరు ఓ అడుగు కూడా ముందుకు వేయడనే టాక్ వుంది. ఎందుకంటే బావ బాగు కోరేది బావ మరిదే అంటారు కదా. చివరకు చిరు రాజకీయాల్లో చేరినా, అరవింద్ మార్కు కనిపించింది. ఇలా ఎన్ని చేసినా ఓ విషయంలో మాత్రం చిరంజీవి, ఖచ్చితంగా కింగ్ నాగార్జున చెప్పినట్టే చేస్తాడు. నాగ్ పై చిరుకు ఆ విషయంలో అంత గురి.

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తెలుగు సినీ చరిత్రలో వీరిద్దరిది ప్రత్యేక స్థానం. కొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో నువ్వా, నేనా అన్నట్టు పోటీ పడిన వీరిద్దరూ.. అప్పటికీ, ఇప్పటికీ మంచి స్నేహితులుగానే మెలుగుతూ వస్తున్నారు. ఇక అప్పట్లో చిరు సినిమాలకి గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చినా, కింగ్ నాగ్ మాత్రం తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు.

అయితే, కింగ్ నాగ్ కి పొలిటికల్ ఇంటరెస్ట్ లేకపోయినప్పటికీ, బిజినెస్ చేయడం మాత్రం నాగార్జున కి చాలా ఇష్టం. అందుకే పరిశ్రమలో మంచి బిజినెస్ మెన్ ఎవరు అంటే చటుక్కున నాగార్జున పేరే ఎవరైనా చెప్పేస్తారు. అయితే నాగార్జున ఎన్ని బిజినెస్ లు చేసినా ఏనాడు సినిమాలని మాత్రం వదిలిపెట్టలేదు.ఇక అప్పట్లో నాగ్ టెలివిజన్ రంగంలో పెట్టుబడులు పెట్టే సమయంలో కావాలనే చిరు చేత కూడా అందులో పెట్టుబడి పెట్టించాడు. అయితే బిజినెస్ వ్యవహారాల గురించి చిరుకి ఏ మాత్రం తెలియకపోయినా కేవలం నాగార్జున మీద నమ్మకంతోనే పెట్టుబడి పెట్టిన చిరుకి బానే కలిసొచ్చిందని అంటారు.

ఇక తరువాత కాలంలో నాగ్ చాలా బిజినెస్ లు చేసినా అవన్నీ సొంతంగా చేసుకుంటూ వచ్చాడు. అయితే రీసెంట్ గా నాగ్ ఇండియన్ ఫుట్ బాల్ లీగ్(ఐ ఎస్ ఎల్)లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, చిరు చేత కూడా మళ్ళీ నాగార్జునే డబ్బులు పెటించినట్టు టాక్. చిరు కూడా డబ్బుల విషయంలో, బిజినెస్ విషయంలో నాగార్జున మీద ఉన్న నమ్మకంతో అడగగానే ఈ ప్రపోజల్ కి ఒకే చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఒక్కో రంగంలో ఒక్కరు కింగ్ లా వుంటారు. అలాంటి వారిని అనుసరించడం మంచిదని చిరు కూడా నిరూపిస్తున్నాడు.

English summary

Chiranjeevi and Nagarjuna Business partners again.