సచిన్ తో ఆటకు సై అంటున్న చిరు, నాగ్!

Chiranjeevi and Nagarjuna with Sachina Tendulkar

04:40 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Chiranjeevi and Nagarjuna with Sachina Tendulkar

సినీ స్టార్లు చిరంజీవి, నాగార్జున, క్రికెట్ దిగ్గజం సచిన్, ఒకే వేదికపై కనిపించారు. కనిపించడమే కాదు. లుంగీలు కట్టి, పోరుకు సయ్యంటూ ప్రత్యర్థులకు సవాలు విసిరారు. కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టు సభ్యుల పరిచయ కార్యక్రమంలో కనిపించిన దృశ్యాలివి. ఐఎస్ఎల్ టోర్నీ అక్టోబరు 1న మొదలవుతోంది. దీంతో ఈ సీజన్ లో కేరళ బ్లాస్టర్స్ కొత్త బృందాన్ని బుధవారం ప్రకటించారు. జట్టు యజమానులు సచిన్ టెండూల్కర్, చిరంజీవి, నాగార్జున, సినీ నిర్మాత అల్లు అరవింద్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. ఈ పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళయాల యువనటుడు నివిన్ పౌలిని జట్టుకు యూత్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.

తొలి రెండు సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన బ్లాస్టర్స్.. ఈసారి కీలక మార్పులు చేసుకుని బరిలో దిగుతోంది. కోచ్ గా స్టీఫెన్ కాంపెల్, కీలక ఆటగాడిగా ఆరోన్ హ్యూస్ ను నియమించుకుంది. మొత్తానికి ఈ పిక్ సోషల్ మీడియాలో కామెంట్స్ నమోదు చేసుకుంటోంది.

ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో గర్భిణీలకు ఎక్కువగా సోకే ప్రమాదకరమైన వ్యాధులు

ఇది కూడా చదవండి: 'ఇంకొక్కడు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: ఫోన్ లాక్ కోడ్ చెప్పలేదని భార్యని ఏం చేసాడో తెలిస్తే షాకౌతారు!

English summary

Chiranjeevi and Nagarjuna with Sachina Tendulkar