శాతకర్ణి అపూర్వ చిత్రంగా నిలుస్తుందన్న చిరు

Chiranjeevi At Balakrishna 100th Movie Launch event

11:37 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Chiranjeevi At Balakrishna 100th Movie Launch event

నందమూరి బాలకృష్ణ సినీ చరిత్రలో 'గౌతిమపుత్ర శాతకర్ణి' ఓ అపూర్వ చిత్రంగా నిలిచిపోతుందని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించాడు . శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న 'గౌతిమపుత్ర శాతకర్ణి' షూటింగ్ ప్రారంభోత్సవంలో చిరంజీవి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ వందవ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైనదన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవడమే ఈ సినిమాకు మొట్టమొదటి విజయం గా పేర్కొన్నాడు. శాతకర్ణి పాత్రలో ఇమిడిపోయి అత్యద్భుత నటనతో బాలయ్య అందరినీ మెప్పిస్తారని అభిప్రాయపడ్డాడు. ఎంతో అవలీలగా బాలయ్య ఇలాంటి పాత్రలు చేస్తారని అన్నాడు. క్రిష్‌ దర్శకత్వంలో చిత్ర విజయం తథ్యమని పేర్కొన్నాడు. చారిత్రాత్మక సినిమాలకు సరైన దర్శకుడు క్రిష్ అని కొనియాడాడు. ఈ సినిమాకు క్రిష్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ, ఈరోజుల్లో ఓ చిత్రం వంద రోజులు ఆడటం అనేది గగనమైపోయిందని కానీ ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని చిరంజీవి ఆకాంక్షించాడు.

ఇవి కూడా చదవండి:

'గౌతమీపుత్ర’ 200రోజుల సినిమా అన్న కెసిఆర్

ఆ రెస్టారంట్ లో నగ్నంగా కూర్చుని తినొచ్చట

రణ్‌వీర్‌సింగ్‌,వాణీకపూర్‌ ముద్దులే ముద్దులు

English summary

Balakrishna 100th movie launch event was started today and Telangana Chief Minister KCR and Mega Star Chiranjeevi attended as chief Guests to this movie launch event and Chiranjeevi says that this movie will be a Historical film in Telugu Film Industry.