అప్పుడు వద్దన్న బాలయ్య ఇప్పుడు మెగాస్టార్‌ను పిలిచాడు

Chiranjeevi At Balakrishna 100th Movie Starting Event

03:13 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Chiranjeevi At Balakrishna 100th Movie Starting Event

ఇటీవల బాలకృష్ణ తన 100వ చిత్రంగా "గౌతమ పుత్రా శాతకర్ణి " చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే . ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నాడు . ఈ సినిమా ప్రారంబోత్సవ వేడుకకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ , చిరంజీవి , రాఘవేంద్రరావు , దాసరి నారాయణ రావు , వెంకటేష్ వంటి ముఖ్య అతిధులు మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే .

ఇవి కూడా చదవండి: వినాయక్ కథకు చిరు ఫిదా

బాలయ్య కొద్ది రోజుల క్రితం తాను నేతృత్వం వహించిన "లేపాక్షి ఉత్సవాల"కు ఆహ్వానించకపోగా ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో తనకు తెలుసునని , తనకు చిరంజీవి పక్కన నిలబడడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు . కానీ బాలయ్యకు అప్పట్లో చిరంజీవి అవసరం లేని బాలయ్యకు ఇప్పుడు ఉన్నట్టుండి తన 100వ సినిమా ప్రమోషన్ కోసం మాత్రం మెగాస్టార్ ను పిలిచాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు .మెగాస్టార్ ఫంక్షన్ కు వస్తే మెగా అభిమానులందరూ సినిమాను ఆదరిస్తారని బాలయ్య భావించినట్లు తెలుస్తోంది . అప్పుడు అవసరం లేని చిరు ఇప్పుడు కావాలా అంటూ బాలయ్య పై ఫాన్స్ మండిపడుతున్నారు . కానీ బాలయ్య గతం చేసిన వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా చిరంజీవి బాలయ్య 100 వ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరై బాలయ్య 100 వ సినిమా పెద్ద హిట్ అవుతుందని , బాలకృష్ణ ఏ పాత్రనైనా అలవోకగా నటించగలడని చెప్పుకొచ్చాడు . ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అవ్వాలని చిరంజీవి కోరుకున్నాడు . పాత వివాదాలు పట్టించుకోకుండా చిరు బాలయ్య ఫంక్షన్ కు రావడంతో చిరు పై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు .

ఇవి కూడా చదవండి:

హిప్నాటిజం గురించి ఆసక్తికరమైన విషయాలు

పవన్ క్యారెక్టర్ ఇదా.!

బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

English summary

Nandamuri Balakrishna's 100th movie was started grandly and Guests like KCR,Dasari Narayana Rao,Chiranjeevi,Venkatesh,Raghavendra Rao were attended as chief Guests to the event.