స్టెప్స్ తో ఇరగదీసిన మెగాస్టార్

Chiranjeevi Dance At CineMaa Awards

10:53 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Chiranjeevi Dance At CineMaa Awards

మెగాస్టార్ లో స్టామినా ఏమాత్రం తగ్గలేదు. అందుకే చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! ఇంతకీ ఏమిటంటే, తమ అభిమాన హీరో 150 వ ఫిల్మ్ ఎలా ఉండబోతోంది? ఇందులో మునుపటి మాదిరిగానే చిరు కనిపిస్తాడా? డ్యాన్స్ లో వాడి వేడి తగ్గిందా? ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో.. ఓ వీడియో రిలీజ్ అయింది. గ్యాంగ్ లీడర్ మూవీలోని టైటిల్ సాంగ్ కు శ్రీకాంత్, సునీల్ తోపాటు కలిసి చిరు డాన్స్ ఇరగదీసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.

తెలుగులో పాపులర్ ఎంటర్టైన్మెంట్ ఓ టీవీ ఛానెల్ ఏటా సినీ మా అవార్డ్స్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది. సినిమాల్లో రకరకాల విభాగాలకు సంబంధించి అవార్డులు ప్రకటిస్తూ వస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున మా అవార్డులను ఇచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆదివారం సాయంత్రం హైద్రాబాద్ లోని హెచ్ ఐసీసీలో ఈ అవార్డు వేడుక వైభవంగా సాగింది. తెలుగు సినిమాకు సంబంధించిన స్టార్స్ హాజరు కానుండడంతో కలర్ ఫుర్ గా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి డ్యాన్స్ మేజర్ హైలైట్ గా నిలిచింది. మరో విశేషం ఏంటంటే.. టెంపర్ మూవీకి ఎన్టీఆర్ బెస్ట్ నటుడిగా అవార్డును అందుకున్నాడు. మొత్తానికి అదుర్స్ అంటున్నారు అభిమానులు.

ఇది కూడా చూడండి: ఆమె ఇంట్లో బయట పడ్డ రహస్య గది

ఇది కూడా చూడండి: కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి: మహేష్ బాబు గురించి తెలియని విషయాలు

English summary

Mega Star Chiranjeevi was once again showed his charm by his dance in Cine Maa awards 2016. Chiranjeevi was danced after a long time and he entertained all the people over there in the auditorium.