బెల్లీ డ్యాన్స్ వేస్తున్న మెగా డాటర్!!

Chiranjeevi daughter practicing belly dance

04:56 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Chiranjeevi daughter practicing belly dance

మెగాస్టార్ చిరంజీవి అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా అందరికీ మొదట గుర్తొచ్చేది డ్యాన్స్. వివిద రకాల స్టెప్పులతో మెగాస్టార్ టాలీవుడ్ లో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ రామ్ చరణ్, అల్లు అర్జున్ వారికంటూ ఒక ప్రత్యేకమైన స్ధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూతురు శ్రీజ కూడా డ్యాన్స్ నేర్చుకుంటుందట. ఇది వినగానే నమ్మాలా వద్దా అనిపిస్తుంది కానీ ఇది నిజమే. కొన్ని రోజుల నుంచి శ్రీజ డ్యాన్స్ క్లాసుల తో చాలా బిజీ గా ఉందట. బెల్లీ డ్యాన్సింగ్ వర్క్ షాప్ లో పాల్గొంటూ మరీ సాధన చేస్తుందట. 'ఇండియన్ గాట్ ట్యాలెంట్' లో ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ మెహెర్ మాలిక్ వద్ద స్పెషల్ ట్రిక్స్ నేర్చుకుంటుంది.

ఈమె నటి కాదు అయితే డ్యాన్స్ ఎందుకు నేర్చుకుంటుంది? ఇంట్రెస్ట్ కొద్ది నేర్చుకోవాలి అనుకుంటే లీడ్ కొరియోగ్రాఫర్ వద్ద శిక్షణ అవసరం లేదు. నిహారిక లాగే సినిమా ల్లోకి ఎంట్రీ ఇస్తుంది అని సమాచారం. అయితే ఇది నిహారిక ఎంట్రీ పై ఆధార పడి ఉంది. ఒకవేళ నిహారిక సక్సెస్ అయితే గనుక శ్రీజ కి డోఖా ఉండదు. అదీ మ్యాటర్.

English summary

Chiranjeevi daughter practicing belly dance at famous lead choreographer Meher Malik. She is giving entry in Films as heroine.