సినీరంగంలోకి చిరు చిన్న కూతురు శ్రీజ కూడా వచ్చేస్తుందట!

Chiranjeevi daughter Srija is giving entry in movies

03:20 PM ON 27th June, 2016 By Mirchi Vilas

Chiranjeevi daughter Srija is giving entry in movies

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో చాలామంది హీరోలుగా వెలిగిపోతున్నారు. వారిలో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ స్టార్ హీరోలుగా ఎదిగితే, మిగిలిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పెద్ద హీరోలుగా ఎదుగుతున్నారు. అయితే ఇప్పటివరకూ చిరు ఫ్యామిలీ నుండి హీరోల రంగప్రవేశం మాత్రమే జరిగింది. ఇప్పుడు మెగా వారసులుగా అమ్మాయిలు కూడా పరిశ్రమలోకి వస్తున్నారు. తాజాగా నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిరంజీవి కుమార్తెలు కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు.

మెగాస్టార్ 150వ చిత్రం కత్తిలాంటోడు చిత్రంలో చిరుకు కాస్ట్యూమ్ డిజైన్ చేసింది ఆయన పెద్ద కూతురు సుస్మితానే. ఇప్పుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే.. శ్రీజ ఎంట్రీ ఇచ్చేది యాక్టర్ గా కాదు.. అలాగని అక్క సుస్మితాలా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు కూడా కాదు.. మరో విభాగంలో ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ప్రొడక్షన్ విభాగం వైపు చిరు కుమార్తె శ్రీజ అడుగులు ఇవ్వబోతుందని సమాచారం. రజినీకాంత్ కూతుళ్లు, అశ్వనీదత్ కుమార్తె మాదిరిగా సినీ నిర్మాణంలో భాగం కానుందిట. మొదట తక్కువ బడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. ఆ తరువాత భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది.

చిరు కుటుంబంలోంచి మరో వారసురాలు సినీ రంగం వైపు వస్తున్నట్లు ఫిక్స్ అయిపోవచ్చు. మొత్తం మీద చిరు ఫ్యామిలీ సినీరంగంలోకి వచ్చేస్తున్నారు.

English summary

Chiranjeevi daughter Srija is giving entry in movies