సంగీత్ లో చిరు పాటలకు శ్రీజ-కల్యాణ్ జంట స్టెప్స్(వీడియో)

Chiranjeevi daughter Srija pair dances in Sangeeth

04:18 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Chiranjeevi daughter Srija pair dances in Sangeeth

చిరంజీవి సెకండ్ డాటర్ శ్రీజ మ్యారేజ్ బెంగళూరులో జరగనున్న నేపధ్యంలో మెహిందీ ఫంక్షన్ ఫాంహౌస్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో క్లోజ్ సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి కొడుకు కల్యాణ్, పెళ్లి కూతురు శ్రీజ.. తమదైన స్టయిల్‌లో తయారయ్యారు. ఆ గెటప్‌లో నూతన దంపతులను ఎవరూ పోల్చుకోలేక పోయారట. చిరంజీవి నటించిన సినిమాల్లోని దాదాపు 20 సాంగ్స్‌కి నూతన దంపతులు స్టెప్స్ వేసారట.. అందులో ‘గువ్వా.. గోరింకతో ఆడింది లేబొమ్మలాటా’.. అలాగే ‘ఆంటీ కూతురా అమ్మో అప్సరా’, ‘శుభలేఖ రాసుకున్నా’ వంటి సాంగ్స్‌లో అదిరిపోయేలా తమదైన శైలిలో ఈ జంట డ్యాన్స్ చేసింది.

రానా, అఖిల్, సీనియర్ డైరెక్టర్ రాఘవేంధ్రరావు స్పెషల్ గెస్టులుగా అటెండయ్యార ని అంటున్నారు. కొరియోగ్రాఫర్ సుధీర్, కన్నడ ఇండస్ర్టీ నుంచి సుమలత, ఆమె భర్త, నటుడు మంత్రి అంబరీష్ కూడా ఈ వేడుకల్లో ఉన్నారట.. మొత్తానికి మెహిందీ ఫంక్షన్ గ్రాండ్‌గా జరగడంతో చిరంజీవి ఫ్యామిలీ హ్యాపీగా ఫీలైంది. దీని తర్వాత సంగీత్ కార్యక్రమం కూడా ఊహించని రేంజ్‌లో జరిగిందని అక్కడికొచ్చిన కొంతమంది ముచ్చటించుకోవడం కనిపించింది. మెహెందీ ఫంక్షన్‌ వీడియో ఓసారి చూసేద్దామా....


English summary

Chiranjeevi daughter Srija pair dances in Sangeeth. Chiranjeevi second daughter Srija and son in law Kalyan dances in Sangeeth function.