శ్రీజకి కాబోయే భర్త ఇతనే

Chiranjeevi Daughter Srija Second Husband

11:11 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Chiranjeevi Daughter Srija Second Husband

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. చిత్తూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కిషన్‌ తనయుడైన కళ్యాణ్‌ ని శ్రీజ పెళ్ళి చేసుకోబోతుంది. శ్రీజ-కళ్యాణ్‌ కాలేజీ రోజుల్లోనే ఇద్దరూ క్లాస్‌మేట్స్‌. అంతేకాదు వీరిద్దరూ ఫ్రెండ్స్‌ కూడా అయితే శ్రీజకి కాబోయే వరుడ్ని ఇన్ని రోజులు చాలా గోప్యంగా ఉంచారు. కానీ ఇప్పుడు శ్రీజ కాబోయే భర్త అయిన కళ్యాణ్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. చిరంజీవి కి అందమైన అల్లుడు దొరికాడని కామెంట్లు విసురుతున్నారు. దీనితో మెగా ఫ్యామిలీ ఫుల్‌ ఖుషి అని సమాచారం. శ్రీజ-కళ్యాణ్‌ నిశ్చితార్ధం ఈనెల 1 న హైదరాబాద్‌లోని ఒక హోటల్‌ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈనెల 10 న శ్రీజని పెళ్ళి కూతుర్ని చేశారు. శ్రీజ-కళ్యాణ్‌ ల వివాహం ఈ నెల 25న అంగరంగ వైభవంగా జరగబోతుంది.

English summary

Mega Star Chiranjeevi's Second Daughter Srija was going to be married second time after taking divorce from her first husband.Srija was going to marry chittoor based Businessman's son Kalyan.