మెగా పెళ్లి సందడిలో  పవన్ - జగన్ తప్పా అంతా ఒక్కటే

Chiranjeevi Daughter Srija Wedding Reception

07:14 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Chiranjeevi Daughter Srija Wedding Reception

ఎక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర కాదు ,  తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సామెతలు ఉండనే వున్నాయి. ఈ సూత్రాలు పొలిటికల్ లీడర్స్ కి బానే వర్తిస్తాయి.  రాజకీయక్షేత్రంలో ఒకరిపై ఒకరు నిప్పులు చెరగడం షరా మామూలే. అయితే, వ్యక్తిగత విషయాలకొస్తే మాత్రం అంతా ఒక్కటే. పార్టీల కతీతంగా ఎవరింట్లో జరిగే శుభకార్యాలకైనా వెళ్లి హాజరేయించుకుంటారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ, పెళ్ళికి   పొలిటికల్ స్టార్లు బానే  తరలివచ్చారు. గవర్నర్ నరసింహన్  నుంచి ఎపి సిఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ మంత్రి కెటిఆర్, ఇలా వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలంతా చిరు కూతురి రిసెప్షన్ లో పాలుపంచుకున్నారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం శ్రీజ రిసెప్షన్ వేడుకలో కనిపించలేదు. ఎపి అసెంబ్లీ సమావేశాలతో క్షణం తీరికలేకుండా ఉన్న జగన్‌కు పెళ్లికి రావకపోవడానికి అనేక కారణాలుండొచ్చుగాని, జగన్ పెళ్లికి రాలేదన్న మాట మాత్రం హైలైట్ అయి కూర్చుంది. ఇక .చిరు తమ్ముడు.. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా శ్రీజ రిసెప్షన్‌కు రాలేదు. జగన్ - పవన్ ల గురించి గుసగుసలు వినిపించాయి.

ఇవి కుడా చదవండి:

సూర్యాస్తమయం తరువాత వెళ్ళారో... రాయి అయిపోతారు

చిరంజీవి ని అవమానించిన స్టార్ హీరోయిన్

మీది ప్రేమా ? స్నేహమా ? టెస్ట్ చేసుకోండి

1/5 Pages

గవర్నర్ నరసింహన్ 

English summary

Chiranjeevi's Second Daughter Srija was married recently and Soo many celebrities like Governer Narasimha,Venkayya Naidu,Chandra Babu Naidu,KTR were attended to this function.