శ్రీజ కు తగిన వరుడేనట

Chiranjeevi Daughter Srija With Her Husband

01:04 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Chiranjeevi Daughter Srija With Her Husband

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గత జ్ఞాపకాల నుండి బయట పడి రెండో వివాహానికి సిద్దమవుతున్న నేపధ్యంలో ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు.పెళ్లికి సంబంధించి ఏ విషయం కూడా అఫీషియల్ గా బయటకు చెప్పకపోయినా, పెద్దగా బయట వాళ్ళను పిలవకపోయినా, మెగా ఫ్యామిలీ ఇంట శ్రీజ పెళ్లికి సంబంధించి విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు బయటకు పోక్కుతూనే ఉన్నాయి. ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో శ్రీజ పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలైంది. పెళ్లి డేట్ ఫిక్సయినట్లు, మార్చి 28న వివాహం జరుగబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా శ్రీజ తనకు కాబోయే భర్త కళ్యాణ్ తో దిగిన ఫోటో ఒకటి బయటకు వచ్చేసింది. కళ్యాణ్ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు తన కూతురు భవిష్యత్తుపై చిరంజీవి కాస్త బెంగగా ఉన్నా,ఇపుడు ఆమె రెండో పెళ్లి ద్వారా కొత్త జీవితం ప్రారంభిస్తుండటం పై మెగా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారట. గతంలో భరద్వాజ్ అనే వ్యక్తితో జిరిగిన పెళ్లి విడాకులకు దారితీయడంతో ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళితో కొత్త జీవితంలోకి శ్రీజ అడుగిడబోతోందని మెగా ఫామిలీ సంబర పడుతోంది.

English summary

Megastar Chiranjeevi's second daughter Srija was going to marry for the second time to her class mate and Business Man Kalyan.The marriage was on 28th march.Mega family was busy with the marriage by saying that he was the correct match to Srija.