పవన్ అభిమానిని చిరు అభిమాని చంపేసాడా?

Chiranjeevi fan killed Pawan Kalyan fan with iron rod

04:00 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Chiranjeevi fan killed Pawan Kalyan fan with iron rod

ఇందుకు అవుననే విధంగా వార్తలు వస్తున్నాయి... మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా పుంజుకున్నాడు. టాలీవుడ్ లో తారాస్థాయికి చేరుకున్నాడు. మరోపక్క జనసేనతో జనానికి దగ్గరవుతున్నాడు. ఆ మధ్య మెగా అభిమానుల మధ్య కూడా విభేదాలు చోటు చేసుకున్నాయి కూడా... ఇక మెగా బ్రదర్స్ నడుమ విబేధాలు ఉన్నాయని ప్రచారం జరిగినా, సర్దార్ ఆడియో వేడుకలో మెగా బ్రదర్స్ అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరించి, సరికొత్త కలరింగ్ ఇచ్చారు. అభిమానుల మధ్య కూడా మనస్పర్ధలు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ నాగ్‌కి సాక్సులు వెయ్యాలనే 'ఊపిరి' వదిలేసాడా?

ఈ నేపధ్యంలో మార్చి 20న కర్నాటక లోని బళ్ళారి లో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఓ విషాద ఘటన మెగా బ్రదర్స్ ని షాక్ కి గురిచేసిందట. వివరాల్లోకి వెళితే, బళ్లారిలో ని కౌల్ బజార్ కి చెందిన మెగా బ్రదర్స్ అభిమానులైన ఇద్దరు యువకులు కలుసుకున్నప్పుడు ఇద్దరి మధ్యా వివాదం చోటు చేసుకుంది. మా అన్న మెగాస్టార్ చిరంజీవిని మించిన హీరో మరొకరు లేడు అంటూ ఒక యువకుడు అనడంతో పవన్ అభిమాని అయిన మరో యువకుడు కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. సరిగ్గా అదే సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన చిరు అభిమాని ఇనుప రాడ్ తీసుకుని పవన్ అభిమానిని బలంగా కొట్టడంతో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు.

ఇది కూడా చదవండి: 'బాహుబలి' కి జాతీయ అవార్డు.. ఇంకా..

మొత్తానికి మెగా అభిమానుల మధ్య జరిగిందని చెబుతున్న ఈ రాద్ధాంతం మెగా బ్రదర్స్ ని కలవరానికి గురిచేస్తోందని అంటున్నారు.

English summary

Chiranjeevi fan killed Pawan Kalyan fan with iron rod. In Bellary Chiranjeevi fan murdered Pawan Kalyan fan with iron rod.