చంద్రబాబుపై మెగా ఫైర్

Chiranjeevi fires on CM Chandrababu Naidu

01:47 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Chiranjeevi fires on CM Chandrababu Naidu

కాపు సామాజిక వర్గం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి ఫైర్అయ్యారు. సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని ఆయన తప్పుబట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో, శనివారం నాడు చిరంజీవి ఓ బహిరంగ లేఖను విడుదల చేసారు. కాపుల మద్య చిచ్చు పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ముద్రగడ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించారు. తని ఘటనకు బాధ్యలైన వారిని ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని చెప్పిన చిరంజీవి, నిందితులను గుర్తించే విధానమంతా చట్ట ప్రకారం జరగాలని సూచించారు.

తుని ఘటనలో గోదావరి జిల్లా వాసుల ప్రమేయం ఏమాత్రం లేదని, గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అరెస్టులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు చిరంజీవి. సామాజిక అంశాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయ పరిణతి ప్రదర్శించాల్సింది పోయి ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన హితవు పలికారు. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన ప్రభుత్వం ముద్రగడ దీక్షకు రాజకీయాలను ఆపాదిస్తూ, అసలు సమస్యను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. తొలి నుంచి ముద్రగడ విషయంలో ప్రభుత్వం వ్యతిరేక పోకడలనే కొనసాగిస్తోందని, ఘర్షణాత్మక వైఖరితో సీఎం చంద్రబాబు ఏం సాధించాలకుంటున్నారో ఆయనకే తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. తుని ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించడమే సరైందన్నారు. సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా సంయమనంతో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు.

ఇది కూడా చూడండి:అల్లు వారబ్బాయితో లావణ్య త్రిపాఠి పెళ్లి!

ఇది కూడా చూడండి:కంచి బంగారు బల్లి కథ

ఇది కూడా చూడండి:మహేష్ సినిమాకి పరిణీతి చోప్రా ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?

English summary

Chiranjeevi fires on CM Chandrababu Naidu.