అందరూ ఫంక్షన్ లో ఉంటే ... ఈయన చేపలు పట్టాడు

Chiranjeevi Fishing At His Farm House

10:56 AM ON 24th August, 2016 By Mirchi Vilas

Chiranjeevi Fishing At His Farm House

అవునా అంటే అవునని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సినీ రీ ఎంట్రీ చిత్రం మోషన్ పిక్చర్ సంచలనం సృష్టించిన నేపథ్యంలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాత, చిరు తనయుడు ఈ పోస్టర్ ను రెట్టించిన ఉత్సాహంతో రిలీజ్ చేశాడు. అంతేనా, తన తండ్రి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు. ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు హాజరయ్యారు. అయితే, పుట్టిన రోజు బాలుడు అయినా చిరు మాత్రం హాజరుకాలేదు. దీంతో ఫంక్షన్ కి రాకుండా చిరంజీవి ఎక్కడున్నాడు అనే దానిపై ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకున్నారు. కొందరైతే, చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలు రహస్యంగా జరుపుకోవడానికి ఎక్కడికో వెళ్లాడని చర్చించుకున్నారు. అయితే, చిరంజీవి మాత్రం ఈ హంగామాకు దూరంగా 22వ తేదీ ఉదయం పూజ చేసుకొని వెంటనే సిటీకి దూరంగా ఉన్న తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్లారట. పనిలో పనిగా ఫామ్ హౌస్ లోనే ఉన్న కొలనులో చేపలు కూడా పట్టాడట. చేపలు పట్టడంలో ఏం ఆనందం కనిపించిందో కానీ, మరుసటి రోజు కూడా ఈ వేటగాడు గాలం పట్టుకొని కొలను దగ్గరికి వెళ్లాడట. మొత్తానికి చిరు బర్త్ డే నాడు చేపలు పట్టే పనిలో వున్నాడని తెల్సి అభిమానులు తెగ సంబర పడ్డారట.

ఇవి కూడా చదవండి:ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే 'జనతా గ్యారేజ్'!

ఇవి కూడా చదవండి:జబర్ధస్త్ వినోదిని గురించి తెలిస్తే షాకవుతారు!

English summary

Mega Star Chiranjeevi birthday celebrations have done grandly at Hyderabad and his son mega power star Ram Charan cut cake in that event but Chiranjeevi did not came to that function but Chiranjeevi spotted by fishing in his farm house on his Birthday.