ఆ విషయంలో పవన్ ని ఫాలో అవుతున్న చిరంజీవి

Chiranjeevi Following His Brother Pawan Kalyan

10:33 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Chiranjeevi Following His Brother Pawan Kalyan

అన్న చేసాడని తమ్ముడా, తమ్ముడు చేసాడని అన్నా అన్నది పక్కన పెడితే, కొన్ని విషయాల్లో మాత్రం తమ్ముడి దారినే ఎంచుకుని, దాన్ని సైతం అధిగమిస్తున్నాడట మెగా స్టార్ చిరంజీవి. ఎందుకంటే, రాజకీయ రంగం వైపు వెళ్ళాక, మళ్ళీ ఇప్పుడు సినిమా లో రీ ఎంట్రీ ఇస్తున్న చిరు తమిళ చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ కూడా ఖరారయింది. అయితే అసలు విషయం ఏమంటే, సృష్టి స్థితి లయ కారకుల్లా మెగా బ్రదర్స్, కథ మాటలు స్క్రీన్ ప్లే.. దర్శకత్వం.. ఇలా అన్నింటా తమ ఆధిపత్యం చూపిస్తున్నారట. అవును..అప్పుడు పవనుడూ, ఇప్పుడు చిరంజీవి. సినిమా తీయునది నేనే.. తీయించేది నేనే.. ఆఖరికి సినిమా చూసేదీ నేనే టైపులో వీళ్ళిద్దరి వ్యవహారం ఉందంటూ ఫిల్మ్ నగర్ జనం అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారట.

సర్దార్ గబ్బర్ సింగ్ అనే కళాఖండానికి నామ్ కేవాస్తే... ఒక డైరెక్టర్ ని పెట్టి, తన టాలెంట్ అంతా అక్కడక్కడా డైలాగ్స్ తో సహా అన్నీ తానై పవన్ కళ్యాణ్ తీస్తే, దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అన్నీ నాకు తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంప ముంచింది. ఇక ఫ్యాన్స్ ఒకింత విసుగుతో ఉన్నారట.

పోనీ చిరంజీవి సినిమా పై ఆశలు పెట్టుకుంటే, తమ్ముడి లాగే అన్నింటా జోక్యం ఏమిటబ్బా అంటూ కామెంట్లు పడుతున్నాయట. కత్తిలాండోడు అనే సినిమాకు డైరెక్టర్ ని వెదకడం మొదలు హీరోయిన్ , కమెడియన్, డైలాగ్ రైటర్ పోస్టర్ మేకింగ్ దాకా ఇలా అన్నీ కన్ఫ్యూజన్లే.. నూట యాభైవ సినిమాలో చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన చిరంజీవికి చాలా గ్యాపు తరవాత ముఖానికి రంగేసుకోవాల్సి రావడం నిజంగా పరీక్షే అని చెప్పవచ్చు. సినిమాలు మారాయి.. ఫ్యాన్స్ టేస్ట్ మారింది. మారుతున్న టేస్ట్ కు అనుగుణంగా సకల ప్రేక్షకులను మెప్పించాలన్న తపనతో ఉన్న చిరంజీవి ఫ్రేమ్ టూ ఫ్రేమ్ చెక్ చేసుకోవడంలో తప్పేమీ లేదు కానీ, ఇలా అన్నింటా తలదూరిస్తే ఎలా అనేది కొంత మంది అభిమానుల వాదన. అయితే కత్తిలాంటి సినిమాకు పదును తగ్గేస్థితి రాకుండా చిరంజీవి జాగ్రత్త పడితే మంచిదనేది మరికొంత మంది అభిప్రాయం. మొత్తానికి ఖైదీ నెంబర్ 150 ఎలా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:రామ్ చరణ్ మీడియాకి క్షమాపణ చెప్పింది ఇందుకేనా?!

ఇవి కూడా చదవండి:మెగా ఫంక్షన్ లో 'అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు'

English summary

Mega Star Chiranjeevi was presently busy with his 150th film shooting and Chiranjeevi takes care in every small thing in this Movie. Like Chiru Paean Kalayan also did the same thing cor his Sardar ZGabbar Singh movie.