చిరుకి కోపం తెప్పించిన అభిమానులు.. ఎందుకో తెలుసా?

Chiranjeevi gets angry on fans

03:17 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Chiranjeevi gets angry on fans

దాదాపు తొమ్మిదేళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ వెండితెర పై కనిపించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రం రీమేక్ లో చిరు నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ లో ఉండగా చిరంజీవిని కొందరు అభిమానులు విసిగించారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. మొన్నీమధ్యే రాత్రిపూట ఓ ఫ్లై ఓవర్ కింద కత్తి రీమేక్ కు సంబంధించిన షూటింగ్ జరుపుతుండగా భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులు తరలి వచ్చారట. ఈ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్, చిరుతో పాటు లొకేషన్ లో ఇంకా చాలా మంది అక్కడే అలాగే చూస్తుండిపోయారు.

చిరును చాలా రోజుల తర్వాత షూటింగ్ లో చూసిన ఆనందంలో అభిమానులు ఈలలు, గోలలతో చిరంజీవికి విసుగు తెప్పించారట. వాళ్లు కావాలని చేసారా? లేదంటే చిరంజీవిని టార్గెట్ చేసారా? లేకపోతే అభిమానంతో ఇలా హద్దులు మీరారా? అనేది ఇంకా తెలియలేదు. అభిమానులు చేసిన గోలతో కనీసం ఆ రోజు రాత్రి ఒక్క సీన్ కూడా చేయలేకపోయాడట చిరంజీవి. ఫ్యాన్సే ఇలా మితిమీరి ప్రవర్తించడంతో చిరుకు ఏం చేయాలో అర్ధం కాలేదట. మొత్తానికి ఫ్యాన్స్ ఇలా హద్దులు మీరితే ఎలా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పటికే తన ఫ్యాన్స్ గీసిన గీత దాటరు.. క్రమశిక్షణకు మారుపేరు అని చెబుతుంటాడు చిరంజీవి. మరి ఈ విషయంలో ఏం చెప్తారో చూడాలి.

English summary

Chiranjeevi gets angry on fans