ఫస్ట్ టైం ఆ అవార్డ్స్ ఫంక్షన్ కోసం చిరు డాన్సు చేస్తాడట!

Chiranjeevi giving life stage performance in Maa awards event

03:22 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Chiranjeevi giving life stage performance in Maa awards event

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి స్ధానం ఎప్పటికీ సుస్ధిరమే. తన కెరీర్లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరు ఆ తరువాత సినిమాలకి గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాజ్య సభ మెంబెర్ గా చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిరు మొదటిసారి స్టేజి పైన లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రిహార్సల్స్ చేస్తున్నారట. రేపు(11-06-2016) జరగబోయే మా టీవీ అవార్డ్స్ వేడుకలో చిరు స్టెప్స్ వెయ్యబోతున్నారట. ఎంతో మంది అతిరధ మహారధులు, సెలబ్రిటీలు, ప్రముఖులు, రాజకీయవేత్తలు ఈ వేడుకకి రాబోతున్నారట. అందుకే ఎప్పుడూ లేని విధంగా ఈ వేడుకని దాదాపు 5 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి ఈ వేడుకని నిర్వహిస్తున్నారట.

ఇప్పటి వరకు ఎప్పుడూ స్టేజి పెర్ఫార్మన్స్ చెయ్యని చిరు ఇప్పుడు ఇలా స్టేజి పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారని తెలియగానే చిరు అభిమానులు ఆ డాన్సు ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొన్న జరిగిన శ్రీజ సంగీత్ లో చిరు స్టెప్లు వేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇలా అందరి ముందు డాన్సు వెయ్యబోతున్నారు. మొత్తం మీద ఈ విషయం తెలియగానే మెగా అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

English summary

Chiranjeevi giving live stage performance in Maa awards event