చిరంజీవితో 'పూరీ' సినీమా ఖాయమట!!

Chiranjeevi in Puri Jagannadh direction

12:04 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Chiranjeevi in Puri Jagannadh direction

మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో సినీమా రావడం ఖాయమని తేలింది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో సినీమా లేకపోవడం, చిరంజీవి 150వ సినీమాకు పూరీయే దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగినా, చివరకు వివి వినాయక్ నే ఖరారు చేయడంతో పూరీకి ఛాన్స్ మిస్సయిందని అనుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య సినిమా వస్తోందట. వివరాల్లోకి వెళితే తమిళంలో విజయవంతమైన 'కత్తి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నిర్ణయించి, అదే చిరంజీవి తో 150వ సినిమా గా తీయాలని భావించిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు పూరీకి అప్పగించాలని అనుకున్నా చివరకు వినాయక్ వైపే మొగ్గు చూపారు.

ఎందుకంటే గతంలో తమిళంలోని 'రమణ' చిత్రాన్ని తెలుగులో 'ఠాగూర్' గా తీసినపుడు వినాయక్ దర్శకత్వం వహించడం, అది సూపర్ హిట్ కావడంతో 'కత్తి' రీమేక్ బాధ్యతలు కూడా వినాయక్ నే వరించాయి. చిరంజీవితో 150వ చిత్రం పూర్తయితే ఇక చిరంజీవి సినిమాల్లో నటించరేమోనని, అలాంటప్పుడు పూరీతో సినీమాయే 'కల' గా మిగిలిపోతుందా అని మెగా అభిమానులు నిరుత్సాహ పడ్డారు. కానీ చిరు 150వ సినీమా తర్వాత కూడా సినీమాల్లో నటిస్తారని, చిరు-పూరీ కాంబినేషన్ లో సినీమా ఉంటుందని తేలిపోయింది. ఈవిషయం పూరీ మాటల్లోనే వ్యక్తమైంది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో పూరీ తీసిన 'లోఫర్' చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో విశాఖ నుంచి సక్సెస్ టూర్ సాగిస్తున్నారు.

ఇందులోభాగంగా రాజమండ్రి వచ్చిన పూరీ, వరుణ్ తేజ్ తదితరులు బుధవారం 'మిర్చివిలాస్' ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సంధర్భంగా అడిగిన ప్రశ్నకు పూరీ స్పందిస్తూ 'చిరంజీవితో సినిమా చేయడం ఖాయం. అది ఎన్నవ సినిమా అనేది అప్రస్తుతం 'అన్నారు'. వాస్తవానికి చిరంజీవి గారికి ఓ కథ చెప్పాను, అది ఎందుకో నచ్చలేదు. మరో కథతో వెళతా అని ఆయన స్పష్టం చేసారు. మొత్తానికి చిరు-పూరీ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతోందంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. అభిమానులకు పండగే మరి.

English summary

Chiranjeevi in Puri Jagannadh direction. Puri Jagannadh just confirmed that this reveal.