అన్నయ్య చేతుల మీదుగా 'సర్దార్‌' ఆడియో

Chiranjeevi is chief guest for Sardar audio

11:36 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Chiranjeevi is chief guest for Sardar audio

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తాజా సినిమా 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చెయ్యడానికి సినిమా యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌ లో తీస్తున్నారు. ఈ సినిమా తరువాత షెడ్యూల్‌ కోసం కేరళ వెళ్ళనున్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని పవన్‌ సిన్నిహిత మిత్రుడు శరత్‌మరార్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదల మార్చి రెండవ వారంలో నిర్వహించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఆడియో విడుదల వేడుకకి ప్రత్యేక అతిధిగా రానున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే గనుక నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. కొన్ని రోజుల క్రితం చిరు సర్దార్‌ సెట్స్‌ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చారు. కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన ఈ సినిమాలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

English summary

Mega Star Chiranjeevi is the chief guest for Sardar Gabbar Singh audio function. Power fame Bobby is directing this movie. Pawan Kalyan and Kajal Agarwal is romancing in this film.