కలెక్షన్ కింగ్ 40 వసంతాల వెండితెర వేడుకకు మెగాస్టార్

Chiranjeevi is coming for Mohan Babu's 40 years function

03:35 PM ON 16th September, 2016 By Mirchi Vilas

Chiranjeevi is coming for Mohan Babu's 40 years function

సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన నటులు చాలా అరుదు. మెగాస్టార్ చిరంజీవి అదే కోవకు చెందుతారని తెలిసిందే. ఇక దాదాపు 40 ఏళ్ల పాటు వెండితెరపై విలక్షణ పాత్రలతో మెప్పించిన నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అంతే. పైగా వీళ్ళిద్దరూ మొదటినుంచీ మాంచి స్నేహితులే. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు స్వర్గం-నరకం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మోహన్ బాబు నటుడిగా 40 వసంతాలు పూర్తిచేసుకున్నారు. మరోవైపు రాజకీయాల నుంచి ఇంచుమించు విశ్రాంతి తీసుకుని సినిమాలపై మెగాస్టార్ చిరంజీవి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాడు.

అయితే తన స్నేహితుడు మోహన్ బాబు కోసం తన కార్యక్రమాలకు కాస్త విరామం ప్రకటించబోతున్నాడు. ఆ మధ్య తెలుగు సినిమా 75 ఏళ్ళ పండుగలో కొంచెం మాటా మాటా అనుకున్నా, ఆతర్వాత మోహన్ బాబు నడిపే, విద్యాలయానికి చిరు వెళ్ళాడు. ఇక ఇప్పుడు 40 వసంతాలు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్ కి టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని లలితకళా పరిషత్ ఘనసన్మానం చేయబోతోంది. విశాఖలోని మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరుగనున్న ఈ కార్యక్రమంలో నవరస నట తిలకం పురస్కారాన్ని కూడా మోహన్ బాబు అందించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం చిరంజీవితోపాటు దాసరి నారాయణరావు, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ తదితరులు విశాఖ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: మగాడికి అమ్మదనం సాధ్యం అంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు!

ఇది కూడా చదవండి: 'నిర్మలా కాన్వెంట్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లి చనిపోయి కనిపించిందా? అయితే మీ పని అయిపోయినట్టే!

English summary

Chiranjeevi is coming for Mohan Babu's 40 years function. Megastar Chiranjeevi is coming as a chief guest for Mohan Babu's 40 years function.