షూటింగ్ లో తడబడుతున్న చిరు.. యాక్టింగ్ మర్చిపోయాడా?

Chiranjeevi is uncomfortable in movie shooting

06:52 PM ON 14th July, 2016 By Mirchi Vilas

Chiranjeevi is uncomfortable in movie shooting

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై ఇప్పుడు ఒక షాకింగ్ వార్త వినిపిస్తోంది. దాదాపు 9 ఏళ్ల నుంచి సినిమాలకు చిరు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణమో లేక వేరే ఏమైనా వ్యక్తిగత సమస్యో తెలియదు కానీ ఈ సినిమా సెట్స్ పై మెగాస్టార్ అసహనంగా కనిపిస్తున్నాడని టాక్. సీన్ పూర్తయిన వెంటనే మానిటర్ లో చూసుకుంటూ చిరంజీవి తన ఫెర్ఫార్మెన్స్ పై ఆందోళన చెందుతున్నట్టు ఆ చిత్ర యూనిట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతీ సీన్ కు ఇలా మానిటర్ లో చూసుకోవడం అతిగా ఎగ్జైట్ కావడం ఆయన లాంటి సీనియర్ నటులు ఎవరూ చేయరని వారు మాట్లాడుకుంటున్నారు.

మెగాస్టార్ గా ఓ వెలుగు వెలిగి మాస్ ఇమేజ్ కు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన చిరంజీవి ఇలా డల్ గా మారడం చిత్ర యూనిట్ కు మింగుడుపడటం లేదట. ఆయన తనపై తాను విశ్వాసాన్ని కోల్పోయారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయని కొందరు చాటుగా మాట్లాడుకోవడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. కత్తిలాంటోడు సినిమాపై చిరంజీవి చాలా రోజులు కసరత్తులు చేశారు. ఇప్పటికే చాలా మంది రచయితలను కూడా మార్చారు. ఫైనల్ గా పరుచూరి ఈ సినిమాలో డైలాగ్స్ కు మెరుగులు అద్దుతున్నారు. అయినా చిరంజీవి మునుపటిలా ఉత్సాహంగా లేకపోవడానికి కారణమేంటని కొందరు ఆరాతీస్తున్నారట.

English summary

Chiranjeevi is uncomfortable in movie shooting