‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గురించి మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi launches star Maa Logo for Meelo Evaru Koteeswarudu program

07:01 PM ON 13th February, 2017 By Mirchi Vilas

Chiranjeevi launches star Maa Logo for Meelo Evaru Koteeswarudu program

రాజకీయ రంగం నుంచి సినీ రంగానికి రీ ఎంట్రీ ఇస్తూ ఖైదీ నెంబర్ 150ద్వారా విజయం నమోదు చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా బుల్లి తెరమీద హల్ చల్ చేయనున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లే సదావకాశం లభించిందని మెగాస్టార్ అంటున్నాడు. త్వరలో ‘స్టార్ మా’ టెలివిజన్ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం టెలివిజన్ కొత్త లోగోను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సోమవారం రాత్రి 9.30లకు మెగాస్టార్ హోస్ట్ గా చేసిన తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈనేపధ్యంలో ఇందుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు.

‘సినిమాలే నా ప్రపంచం. వ్యాపారం చేయాలన్న ఆలోచనే లేదు. కానీ మాటీవీ ఏర్పాటు చేసే సమయంలో నా మిత్రుడు నాగార్జున నుంచి ఆహ్వానం అందింది. మధ్యలో ఆ బంధం దూరమైందని అనుకున్నా. మళ్లీ ఇప్పుడు ఈ కార్యక్రమంతో అది కలిసింది. ప్రజల స్థితిగతులు అర్థం చేసుకోవడానికి ఈ షో ఎంతో ఉపయోగపడింది. ఇందులో మానవతాదృక్పథం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఓ భావోద్వేగల మధ్య జరిగే షో. ఓ ఎపిసోడ్ లో ఓ మహిళ ఆమె అనుకున్న నగదును గెలవలేకపోయింది. ఆమె కష్టాల నుంచి బయటపడేందుకు నా చేతనైన సాయం చేశా.. ప్రతీ క్షణం ఆస్వాదించా. మొత్తం 60 ఎపిసోడ్ లను రూపొందించాం’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు.

బాలకృష్ణనీ ఆహ్వానిస్తా

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సెలబ్రిటీలు వస్తారని చిరంజీవి చెబుతూ,. నాగార్జున, వెంకటేష్ , రాధిక, సుహాసినిలు వచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారని వివరించారు. . బాలకృష్ణ కూడా వస్తారా అన్న ప్రశ్నకు ‘ఆయన నాకు మంచి మిత్రుడు. ఆహ్వానిస్తాం. తప్పకుండా వస్తారని ఆశిస్తున్నా’ అని చిరు చెప్పాడు ఇటీవలే ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని బిగ్ బి అమితాబ్ అభినందనలు తెలియజేశారని చిరంజీవి ఆనందం వ్యక్తంచేశాడు.

ఇది కూడా చూడండి: సంతానం పొందాలంటే ఇవి తినాల్సిందే...

ఇది కూడా చూడండి: రేచీకటి, కీళ్ల నొప్పులు తగ్గించే దివ్యౌషధం ఇదే..!

English summary

chiranjeevi had launched star Maa Logo for Meelo Evaru Koteeswarudu programm