'జనతా' చూసి ఎన్టీఆర్ కి ఫోన్ చేసిన చిరు!

Chiranjeevi make a phone to Ntr

02:38 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Chiranjeevi make a phone to Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రేపు(సెప్టెంబర్ 1న) విడుదలవబోతుంది. అయితే అప్పుడే ఎన్టీఆర్ మానియా మొదలైపోయింది. మరి కొద్ది గంటల్లో జనతా గ్యారేజ్ బొమ్మ థియేటర్స్ లో పడిపోతుంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఫీవర్ లో వున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వసూళ్లు, రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. అటు ఎన్టీఆర్ కూడా రిజల్ట్ పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలో ఎన్టీఆర్ కు అనుకోని అతిధి పోన్ చేశారు. ఆయనెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. జనతా గ్యారేజ్ థియేటర్ ట్రైలర్, టీజర్ తో పాటు సాంగ్స్ బిట్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇంప్రెస్ అయ్యి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అభినందించారాని తెలిసింది.

విజువల్స్ చాలా ఫ్రెష్ గా వున్నాయని, సినిమా మంచి కంటెంట్ తో ఉందని, అప్పియరెన్స్, థీమ్ అన్నీ చాలా చక్కగా వున్నాయని కితాబిచ్చిన మెగాస్టార్, టీం మొత్తానికి అల్ ది బెస్ట్ చెప్పారని తెలిసింది. సినిమా రేపు విడుదల కాబోతున్న ఈ రోజు(31) రాత్రికి ఈ సినిమా బెనిఫిట్ షో పడిపోతుంది. మిర్చివిలాస్.కామ్ ఎన్టీఆర్ కి ఆల్ ద బెస్ట్ తెలుపుతుంది.

ఇది కూడా చదవండి: 'గ్యారేజ్' లో ఆ 12 నిమిషాలు తీసేశారా?

ఇది కూడా చదవండి: బాప్ రే... 'గ్యారేజ్' ఫస్ట్ టికెట్ రూ. 31 వేలట!

ఇది కూడా చదవండి: హీటెక్కిస్తున్న ఐష్-రణబీర్ కెమిస్ట్రీ(వీడియో)

English summary

Chiranjeevi make a phone to Ntr. Megastar Chiranjeevi make a call to Young tiger Ntr after watching Janatha Garage trailer, songs and promos.