మెగాస్టార్‌ 'కత్తి' లాంటి లుక్‌!!

Chiranjeevi new look for his 150th film

06:04 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Chiranjeevi new look for his 150th film

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' రీమేక్‌ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే తమిళ సినిమాలో ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించకుండా మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాని మారుస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్‌ మీసం పెంచాడు. ఈ మీసకట్టు చిరు ముఖానికి బాగా సూటయింది. ఈ మీసకట్టుతో చిరు అందంగా, గంభీరంగా కనిపిస్తున్నాడు. అయితే తమిళంలో 'కత్తి' సినిమాలో విజయ్‌ డబుల్‌ రోల్‌ చేసిన పాత్రలు రెండూ యంగ్‌ క్యారెక్టర్లే. మీసం పెంచవలసిన అవసరం ఏముందో అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.

English summary

Chiranjeevi new look for his 150th film. This movie is remaking from tamil super hit movie 'Kathi'. This movie is directing by V.V. Vinayak and producing by Ram Charan Tej.