పవన్ స్పీచ్ ఇస్తుంటే చిరు ఏమి చేసాడో తెలుసా?

Chiranjeevi observed Pawan Kalyan speech in tirupati

10:59 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Chiranjeevi observed Pawan Kalyan speech in tirupati

అన్నమాటే తనకు వేదమని చెబుతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ సిద్ధాంతపరంగా కొన్ని తేడాలున్నాయని కూడా అంటాడు. అయితే ఒకప్పడు అన్నయ్య చిరంజీవిని తమ్ముడు పవన్ కళ్యాణ్ అనుసరించేవాడు. అన్న ప్రసంగాల్ని ఫాలో అయ్యేవాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రాజకీయంగా చిరు డౌన్ కావడం, అదే సమయంలో పవన్ రైజ్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. తమ్ముడినే అన్నయ్య అనుసరించే పరిస్థితి వచ్చింది. అతడి ప్రసంగాల్ని ఫాలో అవ్వాల్సి వస్తోంది. రెండేళ్ల కిందటి జనసేన ఆవిర్భావ సభ దగ్గర్నుంచి పవన్ రాజకీయ ప్రస్థానాన్ని చిరు ఆసక్తిగా గమనిస్తున్నాడు. తమ్ముడు ఎప్పుడు ఏ ప్రసంగం చేసినా ఫాలో అవుతున్నాడు.

తాజాగా తిరుపతి సభ సందర్భంగా పవన్ చేసిన ప్రసంగాన్ని కూడా చిరంజీవి చాలా ఆసక్తిగా చూసినట్లు చెబుతున్నారు. పవన్ సభ నాడు చిరు తన 150వ సినిమా షూటింగులో బిజీగానే గడిపాడట. అయితే సాయంత్రం పవన్ సభ ఆరంభమయ్యే సమయానికి ఆయన షూటింగ్ నుంచి విరామం తీసుకున్నట్లు చెబుతున్నారు. పవన్ సభకు రాబోతున్న కొన్ని నిమిషాల ముందే చిరు టీవీ ముందు వాలిపోయాడట. పవన్ ప్రసంగం మొత్తాన్ని చిరు ఫాలో అయ్యాడట. తమ్ముడు ఆవేశపూరితంగా ప్రసంగించడాన్ని ఆసక్తిగా తిలకించాడట. పవన్ ప్రసంగం పూర్తయ్యే వరకు మౌనంగానే ఉన్న చిరు, ఆ స్పీచ్ ముగిశాక ఎవరితోనూ దాని గురించి చర్చించకుండా వేరే పనిలో పడిపోయినట్లు సమాచారం.

పవన్ స్పీచ్ ఇచ్చిన తిరుపతితో చిరుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. తర్వాత అర్ధంతరంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరుపతి నియోజకవర్గం వదులుకున్నాడు. మొత్తానికి రెండు రంగాల్లో రాణిస్తావని తమ్ముడికి చెప్పిన చిరు అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: అలాంటి అభిమానులు నాకొద్దు

ఇది కూడా చదవండి: 'దువ్వాడ జగన్నాధమ్' గా సరైనోడు

ఇది కూడా చదవండి: హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

English summary

Chiranjeevi observed Pawan Kalyan speech in tirupati.