బోయపాటికి చిరంజీవి ఫోన్‌ ఎందుకు చేసినట్లు ?

Chiranjeevi Phone To Boyapati Srinu

04:01 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Chiranjeevi Phone To Boyapati Srinu

మాస్‌ చిత్రానికి పక్కా కమర్షియల్‌ గా తెరకెక్కించగల దర్శకుడు బోయపాటి శ్రీను. హీరోని పక్కా మాస్‌గా తెరకెక్కించడంలో బోయపాటిది విభిన్నమైన శైలి. ఈ మాస్‌ డైరెక్టర్‌ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'సరైనోడు'. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేదరిన్‌ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్‌ విడుదలైన 34 గంటల్లోనే 10 లక్షల వ్యూలు రావడమే కాకుండా మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌ని చూసిన మెగాస్టార్‌ చిరంజీవి వెంటనే బోయపాటి శ్రీనుకి ఫోన్‌చేసి టీజర్‌ ఇరగదీసిందని చెప్పాడట. దీనిలో బోయపాటి ఫుల్‌ హ్యపీ అని సమాచారం. ఈ టీజర్‌ ఈ రోజు నుండి రెండు రాష్ట్రాల్లో 1000 స్క్రీన్ల ప్రదర్శించనున్నారని సమాచారం.

English summary

Recently Stylish Star Allu Arjun's Sarainodu Teaser was released and it has got 10 lakh views in just 34 hours.By watching this movie Trailer Mega Star Chiranjeevi called Director Boyapati Srinu and praised him that the movie trailer was awesome.