'ఖైదీ' సినిమాకి చిరంజీవి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Chiranjeevi remuneration for Khaidi movie

05:20 PM ON 26th July, 2016 By Mirchi Vilas

Chiranjeevi remuneration for Khaidi movie

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే 'ఖైదీ' సినిమా ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రమే చిరంజీవికి తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన కోదండరామిరెడ్డి తాజాగా ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. అవేంటంటే.. 1983లో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లోనే చిరంజీవికి దాదాపు 1.75 లక్షల రూపాయల పారితోషకాన్ని ఇచ్చారట. అప్పట్లో అది చాలా ఎక్కువ మొత్తం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ చిరంజీవి తిరగడానికి ఒక ఫారిన్ కారును కూడా తెప్పించారట నిర్మాతలు.

చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా తిరుపతిరెడ్డి వాళ్లు ఎక్కడా రాజీ పడలేదు అని, మిగతా ఆర్టిస్ట్ లను కూడా బాగా చూసుకున్నారని కోదండరామిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్లు మాధవి, సుమలతలు కూడా ఈ సినిమాకు ఒక్కొక్కరు 50 వేల రూపాయల వరకూ పారితోషకంగా తీసుకున్నారట. ఇంత ఎక్కువగా ఖర్చు చేసినా.. బడ్జెట్ పరిమితులేవీ పెట్టుకోకపోయినా.. ఖైదీ నిర్మాతలు భారీగా లాభాలు అందుకున్నట్టు కోదండరామిరెడ్డి చెప్పారు.

English summary

Chiranjeevi remuneration for Khaidi movie