చిరంజీవికి 30 కోట్లు పారితోషికం??

Chiranjeevi remuneration is 30 crores?

01:43 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Chiranjeevi remuneration is 30 crores?

మెగాస్టార్‌ చిరంజీవి నటించబోయే 150వ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. తమిళంలో సూపర్‌ హిట్టయిన 'కత్తి' చిత్రం రీమేక్‌ లో చిరంజీవి నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తేజ్‌ నిర్మించబోతున్న విషయం కూడా తెలిసిందే. ఇందుకోసం చిరంజీవికి 30 కోట్లు పారితోషికం ఇవ్వబోతున్నాడని సమాచారం. 2007 సంవత్సరంలో 'శంకర్‌దాదా జిందాబాద్‌' చిత్రంతో చిరంజీవి మళ్ళీ హీరోగా నటించలేదు. దాదాపు 8 సంవత్సరాల తరువాత చిరంజీవి తన 150వ చిత్రంలో నటించనుండడంతో చిరు అభిమానులకి ఒక పండగలా ఉంది.

టాలీవుడ్‌లో మహేష్‌బాబు ప్రస్తుతం టాప్‌లో వెలుగొందుతున్నాడు. మురుగదాస్‌ దర్శకత్వం వహించబోయే చిత్రానికి మహేష్‌ 25 కోట్లు తీసుకుంటున్నాడు. ఎప్పుటికీ తన తండ్రే కింగ్‌ అనే ఉద్ధేశంతో రామ్‌చరణ్‌ చిరంజీవికి 30 కోట్లు పారితోషికం ఇస్తున్నాడు. రామ్‌చరణ్‌తో పాటు లైకా ప్రోడక్షన్స్‌ సంస్ధ కూడా కో- ప్రోడ్యూస్‌ చేస్తున్నారు.

English summary

Chiranjeevi remuneration is 30 crores for Kathi remake movie?