దర్శక రత్న దాసరి సీరియస్ అయింది .. మరి మెగాస్టార్ ఏంచేసాడంటే ...

Chiranjeevi returned back for Dasari Narayana Rao

11:31 AM ON 1st February, 2017 By Mirchi Vilas

Chiranjeevi returned back for Dasari Narayana Rao

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శత చిత్ర దర్శకులు ముఖ్యంగా ఇద్దరున్నారు. అందులో ఒకరు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అయితే రెండవ వ్యక్తి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, మాజీ కేంద్ర మంత్రి అయిన దాసరి నారాయణరావు ఆరోగ్య సమస్యలతో భాదపడుతూ, మూడు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతకొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు .ఆయనకు మెరుగైన చికిత్సని అందించడం కోసం వైద్యులు ఐసీయూకి తరలించారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధింత సమస్యలతో భాదపడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం దాసరి ఆరోగ్యం నిలకడ గా ఉందని చెబుతున్నారు.. గత కొంత కాలంగా దాసరి అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా యాక్టివ్ గా లేరు. మొన్నీ మధ్యనే మెగాస్టార్ 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' ప్రమోషన్ ఫంక్షన్ కి హాజరయ్యారు. దాసరి నారాయణ రావు 2014లో మంచు విష్ణు హీరోగా ఎర్రబస్సు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ఇంతవరకూ ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. ఇక ఇప్పుడు ఆసుపత్రిలో ఉండడంతో పలువురు సినీ ప్రముఖులు కిమ్స్ కి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీసారు.

నిజానికి ఊపిరితిత్తులు,కిడ్నీ సమస్యలతో ఆయన్ను మొన్న రాత్రి కిమ్స్ లో చేర్చారు.గడిచిన మూడేళ్ళుగా అనారోగ్య సమస్యలతో దాసరి ఇబ్బంది పడుతున్నారు.కొన్నాళ్లుగా పరిస్థితి మెరుగుపడిందని అంతా భావించారు. జయలలిత జీవిత కథ ఆధారంగా కొత్త సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం,కాపు ఉద్యమానికి అండగా సమావేశాలు జరపడంతో దాసరి ఈజ్ బ్యాక్ అని అభిమానులు కూడా సంతోషపడ్డారు.ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరు తో ఆయన సంబంధాలు మెరుగుపడ్డట్టేనని భావిస్తున్న సమయంలో ఈ అనారోగ్య విషయం బయటికి వచ్చింది.

ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అస్వస్థకు గురైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆందోళనకు గురయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన దాసరి గురించి విషయం తెలియగానే వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. ఇప్పటికే చిరంజీవి బావ అల్లు అరవింద్.. కిమ్స్ ఆసుపత్రికి చేరుకుని దాసరిని చూసి వచ్చారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి ప్రియ శిష్యుడైన మోహన్ బాబు కూడా ఉదయం నుంచి కిమ్స్ లోనే ఉంటున్నారు.

ఇక దాసరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రకారం ఆయన చికిత్సకు బాగానే స్పందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశముంది. దాసరికి ఛాతీ శస్త్ర చికిత్స అనంతరం కిమ్స్ ఎండీ.. సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ.. దాసరికి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వచ్చిందని.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని వివరించారు. ఇప్పుడైతే ఆయన బాగున్నారని.. రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని తెలిపారు.

ఇది కూడా చూడండి: వామ్మో ... అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ !?

ఇది కూడా చూడండి: బాప్ రే , అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయట.?

English summary

Producer Dasari Narayana rao health condition is not good by hearing this news immediately chiranjeevi returned back from Delhi.