చిరంజీవిగా పేరు ఎలా మారిందో తెలిస్తే షాకవుతారు!

Chiranjeevi revealed about his name that how he got that name

12:49 PM ON 22nd August, 2016 By Mirchi Vilas

Chiranjeevi revealed about his name that how he got that name

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా చిరంజీవి ఓ సమ్మోహన శక్తి. జయాపజయాలతో నిమిత్తం లేని స్టార్ డమ్ అతని సొంతం. 'స్వయంకృషి'తో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ స్థాయికి.. అక్కడి నుంచి ప్రజారాజ్యంతో పాలిటిక్స్ లోకి దూసుకొచ్చిన, ఆతర్వాత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసాడు. కేంద్రమంత్రి అయ్యాడు. ఇంకా ఆపార్టీ రాజ్య సభ సభ్యునిగా వున్నాడు. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ, 150వ సినిమాగా 'ఖైదీ నెంబర్ 150' తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే చిరంజీవి అసలు పేరు ఎందుకు మారిందో స్వయంగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చిరు చెప్పాడు.

తొలి సినిమా 'పునాదిరాళ్లు' 1978లో షూటింగ్ చేస్తున్న సమయంలో శివశంకర వరప్రసాద్ అనే పేరు స్ర్కీన్ కి చాలా ఆడ్ గా, పెద్దదిగాను ఉంటుంది. ఒకరోజు కల వచ్చింది. నేనెక్కడో గుడిలో ఉంటే బయట నుంచి నా స్నేహితుడు చిరంజీవీ.. రా అన్నాడు. ఎవర్ని పిలుస్తున్నావంటే నిన్నే అన్నాడు. అప్పటి దాకా చిరంజీవి అనే ఒక పేరు ఉంటుందని కూడా నాకు తెలీదు. కల విషయం అమ్మకి చెప్పా. ఆంజనేయస్వామికి మరో పేరు చిరంజీవి అని, స్క్రీన్ నేమ్ గా ఆ పేరు ఎందుకు ఆలోచించకూడదని చెప్పింది. నేను పూజించే ఆరాధ్యదైవం ఆంజనేయస్వామే చెప్పారా అనిపించింది. చాలా దైవికంగా కలలో స్ఫురించిన పేరిది. అమ్మ ఆమోదించింది. తర్వాత 'పునాదిరాళ్లు' టైంలో ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే నీ పేరు.. అని అడిగితే చిరంజీవి అనేశాను. అప్పట్నుంచి అదే స్థిరపడింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

English summary

Chiranjeevi revealed about his name that how he got that name