రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్ తోనే

Chiranjeevi says that he was not joining in BJP

12:00 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Chiranjeevi says that he was not joining in BJP

రెండవ కుమార్తె పెళ్లి సందడిలో వున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు , మెగాస్టార్ చిరంజీవి గురించి బోల్డన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమ్ముడు పవన్ పెట్టిన జనసేన పగ్గాలు చిరు చేతికే వస్తాయని ఊహాగానాలు రాగా, తాజాగా కమల దళం లో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మార్చి 6వ తేదీన రాజమహేంద్రవరం లో బిజెపి సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వస్తున్న నేపధ్యంలో ఆయన సమక్షంలో చిరు బిజెపి తీర్ధం పుచ్చుకుంటారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చిరంజీవి స్పందిస్తూ , పార్టీ మారుతున్నట్లు సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించాడు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బిజెపిలో చేరుతాననే ప్రచారం అవాస్తవమన్నారు. సోషల్‌మీడియా, వాట్సప్‌లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చిరంజీవి విచారం వ్యక్తం చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే యోచనలేదన్నారు. ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరైన చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary

Mega Star Chiranjeevi opposes the news that he was going to join in BJP.Chiranjeevi said that he was not joining in BJP and he will be there in Congress party.