మోహన్ బాబుది రాక్షస ప్రేమ: చిరంజీవి

Chiranjeevi shocking comments on Mohan Babu

01:09 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Chiranjeevi shocking comments on Mohan Babu

నిర్మాత, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నటులు కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు 40 సంవత్సరాల సినీ ప్రస్థాన సన్మాన కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ప్రసంగిస్తూ, మోహన్ బాబు తనకు ఫోన్ చేసి హాజరు కావాల్సిందిగా కోరినప్పుడు తాను వెంటనే ఓకె చెప్పానని అన్నాడు. ఇక ఇది వరకు తన డేట్స్ తన వద్దే ఉండేవని, కానీ ప్రస్తుతం సినిమా చేస్తుండటం వలన ఈ రోజు షూటింగ్ ముందుగానే ప్లాన్ చేశారని మెగాస్టార్ చెబుతూ, అయితే అది రద్దు చేయాల్సిందిగా తాను కోరానని, లేదంటే అవతల ఒక రాక్షసుడిలాంటి వ్యక్తితో గొడవైపోతుందని చెప్పానని సరదాగా అనేశాడు.

మోహన్ బాబు ప్రేమ రాక్షస ప్రేమ లాంటిదని అందులో అంతటి ప్రేమ, వాత్సల్యం ఉంటాయని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

గర్వ కారణం...
మోహన్ బాబు డైలాగ్స్ ను ఒక బుక్ రూపంలో పొందుపరిచి, దాన్ని లండన్ పార్లమెంట్ లో ఆవిష్కరించడమనేది తెలుగువారందరూ, ముఖ్యంగా మాలాంటి కళాకారులందిరికీ గర్వించదగ్గ సంఘటన అని చిరంజీవి అన్నాడు. అది అందరికీ కుదిరేది కాదని, ఇది నిజంగా అరుదైన గౌరవమని చెప్పాడు. ఆయన పొందడమే కాకుండా మనందరికీ దక్కేట్లు చేసిన మోహన్ బాబుకి అందరి సమక్షంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించాడు.

ఇది కూడా చదవండి: తన తల్లిని చంపిన హంతకుడ్ని పట్టించిన ఐదేళ్ల చిన్నారి.. ఇందులో ట్విస్ట్ వింటే దిమ్మతిరుగుద్ది!

ఇది కూడా చదవండి: ఇది అలాంటి ఇలాంటి బస్సు కాదు .. ఏమిటో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఇది కూడా చదవండి: బీజేపీ మహిళా నేతకు స్టేజిపై 'ఐ లవ్ యూ' చెప్పిన కుర్రాడు.. తరువాత ఏమైందో తెలుసా?

English summary

Chiranjeevi shocking comments on Mohan Babu. Padmabhushan Mega Star Chiranjeevi praises Collection King, Nata prapoorna Mohan Babu in Mohan Babu 40 years film industry function.