అల్లు శిరీష్ పై మెగా సంచలన వ్యాఖ్యలు

Chiranjeevi snesational comments on Allu Sirish

11:43 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Chiranjeevi snesational comments on Allu Sirish

అల్లు శిరీష్ నటించిన 'శ్రీరస్తు-శుభమస్తు' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన శ్రీరస్తు-శుభమస్తు చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించాడు. శిరీష్ పూర్తి స్థాయిలో హీరో అయ్యాడని, నటనలో చాలా ఇంప్రూవ్ అయ్యాడని, తన కెరీర్ ను చక్కగా మలచుకుంటున్నాడని మెగాస్టార్ కితాబిచ్చాడు. ఈ మూవీ హిట్ కొడుతుందన్న నమ్మకం తనకుందని చిరు అన్నారు. ఇక చిరంజీవిని శిరీష్ పొగడ్తలతో ఆకాశానికెత్తేశాడు. తనకు ఆయన ఎంత మార్గదర్శకులయ్యారో, తన కెరీర్ కు ఎంత ప్రోత్సాహమిచ్చారో గుర్తు చేసుకున్నాడు.

గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ కుటుంబ విలువలను చాటి చెబుతుందని, తన మావయ్య ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరవుతారన్న నమ్మకం తనకుందని శిరీష్ అంతకు ముందే తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

English summary

Chiranjeevi snesational comments on Allu Sirish