శ్రావణంలో మెగా అల్లుడి ఎంట్రీ

Chiranjeevi son in law entry in sravana masam

11:05 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Chiranjeevi son in law entry in sravana masam

ఇప్పటికే మెగా కుటుంబం నుంచి పలువురు హీరోలు రంగప్రవేశం చేయగా, ఇప్పుడు మరో హీరో ఎంట్రీ అవ్వబోతున్నాడు. అది కూడా ప్రస్తుత ఆషాఢం ముగిశాక శ్రావణ మాసంలో జరుగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ ఈ శ్రావణ మాసంలో టాలీవుడ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాడన్నది ఫిల్మ్ నగర్ లో జోరుగా నడుస్తున్న టాక్. ఇటీవల చిన్న కూతురు శ్రీజకు పెళ్లి ఘనంగా చేసిన సంగతి తెల్సిందే. అయితే తన భర్త కోరికను చిరు ముందుంచడంతో కళ్యాణ్ ఎంట్రీకి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ సూచన మేరకు కళ్యాణ్ యాక్టింగ్ క్లాసులకు హాజరవుతున్నట్టు చెబుతున్నారు.

ఫిజిక్, లుక్ లోనూ చిన్నచిన్న మార్పులు అవసరమని కూడా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ కు అడ్వైజ్ చేసినట్టు వినికిడి. కళ్యాణ్ తెరంగేట్రం కోసం టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ శ్రావణ మాసంలో మరో మెగా అల్లుడు వెండితెర మీదకు రావడం ఖాయం.

English summary

Chiranjeevi son in law entry in sravana masam