టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న చిరు అల్లుడు

Chiranjeevi son in law Kalyan is giving entry in tollywood

11:03 AM ON 1st July, 2016 By Mirchi Vilas

Chiranjeevi son in law Kalyan is giving entry in tollywood

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. వీరితో పాటు గత కొంతకాలంగా మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే, మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా మెగా ప్రిన్సెస్ నిహారిక ఒక మనసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అట్టర్ ప్లాప్ ను సొంతం చేసుకుంది. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా వచ్చే ఏడాది హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అలాగే, చిరు పెద్ద కూతురు సుష్మిత గతంలో చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరోసారి సుష్మిత చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. వీరి బాటలోనే, మెగా ఫ్యామిలీని సైతం ఆశ్చర్యపరుస్తూ.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమె మిగతావారిలా కాకుండా, నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనికి.. భర్త కళ్యాణ్ కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాడని తెలుస్తోంది.

త్వరలో శ్రీజ ఓ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి.. ముందుగా తక్కువ బడ్జెట్ సినిమాలు తీసి ఆ పై భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యామిలీ బ్యానర్లుగా గీతా అర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి. వీటితో పాటు ఇటీవల రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి 150వ చిత్రం కోసం కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను నెలకొల్పాడు. అందరూ అనుకుంటున్నట్లు శ్రీజ కూడా కొత్త నిర్మాణ సంస్థను స్థాపిస్తే.. ఆ సంస్థ మెగా ఫ్యామిలీకి చెందిన నాలుగో బ్యానర్ అవుతుంది. అలాగే, గత కొంతకాలంగా చాలా మంది ఊహిస్తున్నట్టు గానే, శ్రీజ భర్త కళ్యాణ్ కూడా హీరోగా తెరంగేట్రం చేసే ఆలోచనలో ఉన్నాడని మెగా క్యాంప్ చెబుతోంది.

ఇప్పటికే, అమెరికాలో మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజ భర్త కళ్యాణ్ తనకు కూడా ఉపయోగం ఉంటుందనే ఆలోచనతోనే.. తన భార్య శ్రీజతో ఓ ప్రొడక్షన్ హౌస్ ను పెట్టిస్తున్నాడని తెలుస్తోంది. లుక్ పరంగా.. పర్సనాలిటీ పరంగా కళ్యాణ్ లో హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు పలువురు చిరంజీవి దగ్గర చెప్పారట. మొత్తానికి, టాలీవుడ్ లో హీరోలుగా నిన్నమొన్నటి దాకా కొడుకులు ఎంట్రీ ఇచ్చేవారు. ఇప్పుడు నెమ్మదిగా ఆ ట్రెండ్ అల్లుళ్లకు కూడా పాకుతోంది. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇప్పటికే సుధీర్ బాబు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించి బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు.

ఇప్పుడు అదే బాటలో మెగా అల్లుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి చిరు అల్లుడు కళ్యాణ్ ఎంత వరకు ప్రేక్షకుల్ని అలరిస్తాడో చూడాలి మరి.

English summary

Chiranjeevi son in law Kalyan is giving entry in tollywood