నీకు ఆ సత్తా ఉందని నాకు తెలుసు... చిరంజీవి

Chiranjeevi Speech At Sardaar Audio

09:37 AM ON 21st March, 2016 By Mirchi Vilas

Chiranjeevi Speech At Sardaar Audio

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో దూసుకు పోతున్నట్టే రాజకీయాల్లో కూడా ఉన్నత శిఖరాలు చేరుకుంటాడా? అవుననే మాట వినిపిస్తోంది. సాక్షాతూ పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అన్నమాట ఇది. ఇప్పటికే జనసేన పార్టీ పెట్టిన పవన్ ఇంక నటనకు గుడ్ బై చెప్పేసి , రాజకీయాల్లో పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పడం తెల్సిందే. ఇదే విషయాన్ని చిరంజీవి పరోక్షంగా ప్రస్తావిస్తూ, 'ఏ రంగం లోకి వెళ్ళినా సినీ రంగాన్ని మాత్రం వదిలి పెట్టొద్దు. పవన్‌ ఎదుగుదల చూసి గర్వపడుతున్నా. ఏ రంగంలో ఉన్నా పవన్ రాణిస్తాడు. అందుకే సినీ రంగాన్ని వదులుకోవద్దని పవన్‌కు సలహా ఇస్తున్నా. మరో రంగంలోనూ రాణించగలడు' అని పరోక్షంగా పవన్‌ రాజకీయ రంగంపై చిరంజీవి వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ నోవాటెల్‌లో జరిగిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఆడియో వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చే సిన చిరంజీవి మాట్లాడుతూ, ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే ఇంత మంది అభిమానులను సంపాదించుకోగలిగావని.. వారిని నొప్పించకుండా జోడు గుర్రాల స్వారీ చేయాలని సూచించారు.

షోలే మాదిరి రికార్డు సృష్టించాలి ...

బాలీవుడ్‌ క్లాసిక్‌ షోలే సినిమాలా ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ రికార్డులు సృష్టించాలని చిరంజీవి ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘చాలా రోజుల తరువాత పవన్‌ నటించిన చిత్రానికి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఈ మధ్య కాలంలో గబ్బర్‌సింగ్‌ ఎక్కువగా చూశా.. ఆ చిత్రంలోని ప్రతిఫ్రేమ్‌ను ఎంజాయ్‌ చేశా. ఇప్పుడు సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ పవన్‌ మనసుకు దగ్గరైన సినిమా. ఆయనే కథ, స్రీన్‌ప్లే అందించారు కాబట్టి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో వూహించవచ్చు. దర్శకుడు బాబీ అద్భుతంగా తెరకెక్కించాడు’ అని చెప్పారు. ఈ చిత్రం ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాలని.. పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆకాంక్షించారు. రికార్డులు ఏ ఒక్కరి సొంతం కాకూడదన్నారు. ఈ చిత్రంలో పవన్‌ వేసిన వీణ స్టెప్‌ కోసం తానూ ఎదురుచూస్తున్నానని చిరంజీవి అన్నాడు.

వాచీ ఇచ్చిన మెగాస్టార్ కే టైం ఇవ్వలేదా?

ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్య చలవే ...

సర్దార్ ఫంక్షన్లో పవన్ ఎమోషనల్ స్పీచ్

English summary