మీలో ఎవరు కోటీశ్వరుడికి చిరు పారితోషికం ఎంతో తెలుసా?

Chiranjeevi taking 10 lakhs remuneration for Meelo Evaru Koteeswarudu each episode

12:26 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Chiranjeevi taking 10 lakhs remuneration for Meelo Evaru Koteeswarudu each episode

దాదాపు 8ఏళ్ళు సుదీర్ఘ కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత. ఈ సినిమాలో నటిస్తూనే మరో పక్క 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో ప్రోమోలు ప్రసారమవుతూ సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ షోకు చిరంజీవి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది అందరి మదిలో మొదలైన ప్రశ్న. తన రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా, ఇప్పటివరకు ఏ హోస్ట్ తీసుకోనంత చిరు తీసుకుంటున్నాడట.. అక్షరాల ఒక్క ఎపిసోడ్ కు 10 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం ఒక్క మెగాస్టార్ కే చెల్లిందని అందరూ చెప్పుకుంటున్నారు.. చిరు కున్న క్రేజ్ దృష్ట్యా నిర్వాహకుల ఇంత ఎమౌంట్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. అతి త్వరలోనే ఈ షో మా టీవీలో ప్రసారం కాబోతుంది.

English summary

Chiranjeevi taking 10 lakhs remuneration for Meelo Evaru Koteeswarudu each episode