మెగాస్టార్ కి జనసేన పగ్గాలు

Chiranjeevi To Join Janasena Party

02:40 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Chiranjeevi To Join Janasena Party

రాజాకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు .... నిన్నటి శతృవులు నేటి మితృలు అవ్వడం ... ఓ పార్టీ గుర్తుపై నెగ్గి మరో పార్టీకి జంప్ అవ్వడం ... ఈ పార్టీలో ఉంటూ , మరో పార్టీ కి ఉప్పందించడం ... ఇక్కడే ఉంటూ , అక్కడకు వెళ్ళడానికి మార్గం వెతుక్కోవడం .... ఇష్టం లేని వాళ్ళు వస్తున్నా అధినేతల మాటలు విని, కిమ్మనకుండా వుండడం ... ఇలా ఒకటా రెండా నిత్యం ఎన్నో ఇలాంటి ఘటనలు .... అందుకే ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు ... అవసరం వచ్చినప్పుడు ఓటు ద్వారా సత్తా చూపించేస్తున్నారంతే .... ఇంతకీ విషయం ఏమంటే,

ప్రజా రాజ్యం స్థాపించి, 18 సీట్లు మాత్రమే రావడంతో, ఇక పార్టీ నడపలేక, హోల్ సేల్ గా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసిన మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు 150వ సినిమా పై దృష్టి పెట్టాడు. ఈ లోగానే రెండవ కూతురు శ్రీజ పెళ్లి కూడా చేసే పని లో పడ్డాడు. మరో పక్క రాజ్యసభ సమయం కూడా దగ్గర పడుతోంది. ఇక సినిమాలే చూసుకుంటాడని భావిస్తున్నా, తాజాగా మరో అంశం తెరమీదికి వస్తోంది. అదేమంటే, తమ్ముడు పవన్ పెట్టిన జనసేన కు సారధ్యం వహించే బాధ్యతను చిరు భుజాన వేసుకుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేనకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి , టిడిపి అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేసాడు. ఫలితంగా ఈ రెండు పార్టీలు అటు కేంద్రంలో , ఇటు రాష్ట్రంలో అధికారం పొందాయి. అంతేకాదు రాజధాని అమరావతి భూసేకరణ , కాపుల రిజర్వేషన్ తదితర అంశాలపై సమస్య వచ్చినపుడు ట్రబుల్ షూటర్ గా రంగప్రవేశం చేసిన పవన్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు సరికదా , కనీసం ఎవరి తరపునా ప్రచారం కూడా చేయలేదు. రాష్ట్ర విభజన నేపధ్యంలో చిరు , పవన్ ల సామాజిక వర్గం కాపులకు పట్టు దొరికే పరిస్థితి కూడా వచ్చింది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి జనసేనను సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు వినికిడి.

మెగా స్టార్ 150వ సినిమా ఆ తర్వాత రాజ్యసభ పదవీకాలం కూడా దగ్గర పడడం వంటి పరిణామాలకు తోడు కాంగ్రెస్ కి సరైన ఆదరణ లేని సమయంలో ఆ పార్టీని పట్టుకుని వేళ్ళాడ్డం కన్నా, ప్రజారాజ్యం లేకున్నా జనసేన తమ్ముడి సొంత పార్టీ ఉండనే ఉన్నందున ఆ పార్టీని ఏక్టివేట్ చేస్తే, ఎన్నికల్లో అన్నదమ్ములు కల్సి , కదన రంగంలోకి దూకితే , ఇక తిరుగు ఉండదని , అప్పటికి టిడిపి ఇమేజ్ కూడా జనంలో పలచబడుతుందని, ఇక అధికారం ఈజీ అవుతుందని కొంతమంది తెరవెనుక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వినికిడి. ప్రస్తుతానికి అన్నదమ్ములు సినిమాల్లో బిజీ గా ఉన్నందున అదను చూసి, కార్యరంగంలో దూకుతారని బోగట్టా ... నిజమో కాదో వేచి చూడాలి ...

English summary

Mega Star Chiranjeevi presently in Congress Party.Recently a came to know that Mega STar Chiranjeevi to Resign for Congress party and getting ready to join in his brother party Janasena.