సొంత మండలంలో  'శ్రీమంతుడు' మెగాస్టార్

Chiranjeevi visits his adopted village Perupalem

10:14 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Chiranjeevi visits his adopted village Perupalem

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి సొంత మండలం లో దత్తత తీసుకున్న గ్రామానికి సౌకర్యాల కల్పనకు నడుం కట్టాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు చిరు సొంతూరు. అయితే సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన పథకంలో భాగంగా చిరంజీవి మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో 5కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు చిరంజీవి సోమవారం భూమిపూజ చేసాడు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే బంగారు మాధవనాయుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచి సోమిశెట్టి రంగనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. చిరంజీవి మాట్లాడుతూ పేరుపాలెం సౌత్‌ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండడంతో దత్తత తీసుకున్నానని చెప్పారు. గ్రామంలో నూతన జూనియర్‌ కళాశాల, పీహెచ్‌సీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. భవిష్యత్‌లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని ప్రకటించాడు.

English summary

Actor and Rajya Sabha member Chiranjeevi visited Perupalem (south) village in Mogalthuru mandal in West Godavari district on Monday. He adopted perupalem village .In a meeting there, he stated that he would develop Perupalem, a village on the sea coast, into a model village and make it a tourist hub.