పెళ్లయింది... ఇక సినిమా పై దృష్టి

Chiranjeevi want to focus on his 150th film

12:03 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Chiranjeevi want to focus on his 150th film

ఎన్నాళ్ళ నుంచో ప్రచారం సాగుతూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి ఘనంగా జరిగింది. బెంగుళూరులో సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రారంభమైన శ్రీజ-బిజినెస్‌మేన్ అయిన కళ్యాణ్‌ ల వెడ్డింగ్ తెల్లవారుజామున 12:30 గంటల వరకు కొనసాగిందట. దాదాపు 250 మంది గెస్టులు హాజరయ్యారు. ఈ వివాహం చిరు ఫ్యామిలీలో చివరి అతి పెద్ద శుభ కార్యమని, అందుకే ఆరు రోజులపాటు నిర్వహించారని అంటున్నారు. ఈ వేడుకకు వెళ్ళలేని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలను చూస్తూ తమ ఆనందాన్ని ఫ్రెండ్స్ తో పంచుకుంటున్నారట.

ఈ వెడ్డింగ్ ముగియడంతో మెగాస్టార్ కి పెద్ద భారం దిగిందని అంటున్నారు. ఇక నా 150వ సినిమా మీద ఫోకస్ పెడతాను అని ఆయన తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. శ్రీజ పెళ్లి వేడుకల్లో భాగంగా సంగీత్ లో కూడా చిరు చిందేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి చిరంజీవి సెకండ్ డాటర్ శ్రీజ.. న్యూలైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది.

English summary

Chiranjeevi want to focus on his 150th film. After completion of Srija marriage Chiranjeevi want to focus on his 150th movie.