చిరుకి కూడా ఆ హీరోయిన్ ఏ కావాలట!

Chiranjeevi wants Anushka in his 150th film

10:21 AM ON 13th May, 2016 By Mirchi Vilas

Chiranjeevi wants Anushka in his 150th film

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 150వ చిత్రం ఇటివలే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కానుంది. అయితే చిరంజీవి సరసన హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతుంది. ఇప్పటికే నయనతార, అనుష్క, తమన్నాల పేర్లు వినిపిస్తున్నాయి. నయనతార అయితే ఈ సినిమా చేయడానికి డేట్స్ లేవని చెప్పినట్టు తెలిసింది. దాంతో ఇప్పుడు అనుష్క ఫైనల్ అయ్యేలా ఉంది. చిరంజీవి కూడా అనుష్క అయితే బెటర్ అనే ఉద్దేశంలో ఉన్నాడట! దాంతో అనుష్కతో చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. మొత్తానికి అనుష్క దాదాపు ఖరారు అయినట్టే అని సమాచారం!

English summary

Chiranjeevi wants Anushka in his 150th film. Megastar Chiranjeevi wants Anushka as a heroine in his 150th film.