ఢిల్లీలో చేతి సంచితో మెగాస్టార్... (వీడియో)

Chiranjeevi with bag in parliament

11:09 AM ON 23rd July, 2016 By Mirchi Vilas

Chiranjeevi with bag in parliament

మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయినట్టు యూనిట్ చెబుతోంది. థర్డ్ షెడ్యూల్ లో హీరో-హీరోయిన్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కించేలా డైరెక్టర్ వినాయక్ ప్లాన్ చేశాడు. ఇంతలో... సీన్ కట్ చేస్తే... చిన్న చేతిసంచితో ఢిల్లీలో పార్లమెంటు ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఎవర్రా అనుకుంటే, ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి. గెటప్ చూస్తే, సినిమా గెటప్ లానే వున్నా అది కాదని తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఏపీకి హోదాపై రాజ్యసభలో చర్చ, ఓటింగ్ నేపథ్యంలో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చేసి, మెగాస్టార్ ఢిల్లీలో వాలిపోయాడు.

కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగా వున్న మాజీ కేంద్రమంత్రి చిరు, అక్కడ ఎన్ని రోజులుంటారో తెలీదు. హోదాపై ఓటింగ్ పూర్తయిన మరుక్షణం ఆయన ఢిల్లీలో ఫ్లైటెక్కి హైదరాబాద్ కు చేరుకుంటాడా? లేక అధినేత సోనియాతో మంతనాలు వంటి ఇతరత్రా కారణాలతో ఆలస్యమవుతుందా? ఇవే ప్రశ్నలు యూనిట్ ని వెంటాడుతున్నాయి. ఆది నుంచి 150వ మూవీకి ఇలాంటి అడ్డంకులు వస్తూనే వున్నాయి.

English summary

Chiranjeevi with bag in parliament